మనీ: ఫిక్స్డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లు పెంపు..!
ప్రస్తుతం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినటువంటి ఎన్నో బ్యాంకులు 7% కంటే ఎక్కువ ఫిక్స్ డిపాజిట్ రేట్ లపై వడ్డీని అందిస్తున్నాయి.. వాటిలో ముఖ్యంగా ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఫిక్స్ డిపాజిట్ లపై 7.5% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈ వడ్డీ రేట్లు మీరు పొందాలి అనుకుంటే ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వెయ్యి రోజులు ఫిక్స్ డిపాజిట్ ఉంటే ఈ వడ్డీ రేట్లు లభిస్తాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పెట్టుబడి కాల పరిమితి 525 రోజులు, 990 రోజులు ఉండాలి. ఇక సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ 999 రోజులు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 7.4 9% వడ్డీని అందిస్తున్నాయి.
ఇక జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మూడేళ్ల కంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ఫిక్స్ డిపాజిట్ లపై 7.35% అందిస్తుంది. ఇక ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు మరెన్నో స్మాల్ సేవింగ్స్ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువ అందిస్తూ ఉండడం హర్షదాయకం.