మనీ: కస్టమర్లకు శుభవార్త తెలిపిన యాక్సిస్ బ్యాంకు.. వడ్డీ రేటు పెంపు..!!

Divya
ప్రైవేటు రంగ బ్యాంక్ అయినా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచింది.ఇక దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయినా యాక్సిస్ బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్త అందించడం కోసం ఇలా వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే రూ.2 కోట్లలోపు డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లపై ఏ విధంగా వడ్డీ రేట్లు పెంచింది అనే విషయానికి వస్తే సాధారణ పౌరులకు 2.7.5% నుండి 5.75% వరకు వడ్డీ రేట్లు అందించడానికి సిద్ధమయింది. ఇకపోతే అదే సమయంలో బ్యాంకు సీనియర్ సిటిజనులకు 2.75% నుండి 6.20శాతం వడ్డీని పెంచింది.

ఇకపోతే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్లు రేట్లు పెరిగాయి. దీనితో పాటు బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేటును రూ.2 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు పెంచింది. ఇకపోతే యాక్సిస్ బ్యాంకు తన సాధారణ కస్టమర్లకు గరిష్టంగా రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ ఫిక్స్ డిపాజిట్ లపై ఒక సంవత్సరం 11 రోజుల నుండి ఒక సంవత్సరం 25 రోజుల వరకు వడ్డీని అందిస్తుంది. ఇక ఈ వడ్డీ రేటు 5.75% అదే సమయంలో సాధారణ పౌరులకు 14 రోజులకు ఫిక్స్ డిపాజిట్ లపై 2.75% వడ్డీ రేటును ఆఫర్ అందిస్తోంది. అలాగే 30 నుండి 45 రోజుల ఫిక్స్ డిపాజిట్లపై 3.25% వడ్డీ లభిస్తుంది.
ఇక అలాగే రెండు సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ పై 5.60 శాతం,  10 సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ పై 5.75% లభిస్తుంది.  అది సీనియర్ సిటిజన్స్ కి అయితే ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ లపై 6.20 శాతం వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: