మనీ: ఈ వ్యాపారంతో ప్రతిరోజు ఖచ్చితమైన రాబడి.!

Divya
ఈ మధ్యకాలంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక అలాంటి వారిలో మీరు కూడా ఖాళీగా ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ చెందిన వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది కేవలం కొత్తిమీర వ్యవసాయం అని చెప్పవచ్చు.తాజాగా కొత్తిమీరకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. కేజీ కొత్తిమీర ధర సుమారుగా రూ.500కు పైగా ధర పలుకుతోంది. ఇక మార్కెట్లో కొత్తిమీరకు ధర భారీ ధర పలుకుతుంది. కాబట్టి మీరు ఈ వ్యాపారం చేసి మంచి లాభాన్ని పొందవచ్చు.

ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్న నేపథ్యంలో నీటి కొరత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఉన్న పెరట్లో లేదా ఒక ఎకరం భూమిలో కొత్తిమీర సాగు చేసి ప్రతిరోజు ఉదయాన్నే మార్కెట్ కి తరలించడం వల్ల మంచి ఆదాయం లభిస్తుంది. ఒకవేళ కొత్తిమీరకు మార్కెట్ లేని సమయంలో కూడా ఈ కొత్తిమీర నుంచి మీకు డబ్బు వస్తుందని చెప్పవచ్చు.  ఎందుకంటే కొత్తిమీర నుంచి ఎలాగో ధనియాలు వస్తాయి కాబట్టి ధనియాలను అలాగే అమ్మిన లేదా పొడిచేసి అమ్మినా సరే మీకు మంచి ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా కొత్తిమీర వ్యవసాయాన్ని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వారు ప్రతి రోజు రూ.2 వేల పైగా ఆదాయాన్ని పొందుతున్నట్లు సమాచారం. ఇక మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కొత్తిమీర వ్యాపారం అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.  ఇక నేల సారవంతమైనది లేకపోయినా సరే ఈ పంట పండుతుంది. నాణ్యమైన ధనియాల గింజలను మాత్రం మీరు కొనుగోలు చేసి భూమిలో విత్తు నాటిన తర్వాత కొద్ది రోజులకే ఈ పంట రావడం మొదలవుతుంది . ఇక మీకు మంచి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: