మనీ: పెట్టుబడి లేకుండా నెలకు రూ.40 వేలకు పైగా ఆదాయం..!!
ముఖ్యంగా వెడ్డింగ్ ప్లానర్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వారు ఆహారం, టెంట్లు, వెయిటర్లు, మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందిస్తారు. మరి కొంతమంది మొత్తం పెళ్లిని వారే ప్లాన్ చేస్తారు. ఇక మనం ఒక్క చిన్న పని కూడా చేయాల్సిన పని ఉండదు. అన్ని విషయాలను వారే దగ్గరుండి మరీ చూసుకోవడం గమనార్హం. దీంతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరియర్ ఆప్షన్ గా మారిపోయింది. ప్రతిరోజు డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది దీనినే కెరియర్ ప్లానింగ్ గా మార్చుకుంటున్నారు.ముందుగా మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సును చేయాల్సి ఉంటుంది. ఇందులో డిప్లమా చేస్తే సరిపోతుంది. ఇక వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్స్ మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతే కాకుండా వెడ్డింగ్ ప్లానర్ కంపెనీలో మీరు కొద్ది రోజులు ఉద్యోగం చేస్తే మీకు అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు..
మీతో పాటు మరికొంతమందిని మీరు నియమించుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఇందులో మీరు పెట్టుబడి పెట్టకుండానే ఆర్డర్ తీసుకున్న వ్యక్తుల ద్వారా కొంత డబ్బును అడ్వాన్సుగా తీసుకొని దానినే పెట్టుబడిగా పెట్టి ప్రతినెల రూ.40 వేల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఇందులో మెలుకువలు తెలుసుకొని దీనిని కెరియర్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.