మనీ: ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు..!!

Divya

ఇకపోతే జూలై మాసం మొదటి రోజే ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట ఇచ్చే శుభవార్తను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కొత్త రేట్లు అమలుచేసాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీలు ప్రతినెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఇంధన ధరలను పరిగణలోకి తీసుకొని కొత్త ధరలను సవరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జూలై 1 కావడంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా సవరించబడ్డాయి ముఖ్యంగా ధరలు సవరించడంతో సామాన్యుడికి కూడా కొంచెం ఊరట కలిగిందని చెప్పవచ్చు.
ఇకపోతే 19 కేజీల కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు అయ్యాయని.. ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఒకటో తేదీ నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.198 దిగొచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వ్యత్యాసం అనేది ప్రాంతం యొక్క ప్రాతిపదికన మీద సిలిండర్ రేటు తగ్గించడం జరుగుతుంది. ఇకపోతే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం నిలకడగానే ఉంది. ఇందులో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. ఇక మే 19 నాటి ధరలు కొనసాగుతూ వస్తూ ఉండడం జరుగుతుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా రూ.1060 చెల్లించాల్సిందే.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 2021 గా ఉంది.. ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2186 కి చేరగా.. కోలకతా లో రూ.2140 వుండగా.. చెన్నై లో రూ.2186 కి చేరింది. జూన్ నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.135 వరకు ధరలు దిగి వచ్చాయి. మొత్తానికి అయితే హోటల్స్, చిన్న చిన్న బండ్ల మీద టిఫిన్ సెంటర్లు,  మొబైల్ క్యాంటీన్ వారికి ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: