మనీ: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!!

Divya
తాజాగా రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటును పెంచిన తర్వాత వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటికి సంబంధించిన రుణాలు లేదా వ్యక్తిగత రుణాల రేట్లను పెంచడంతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి కొన్ని బ్యాంకులు. ముఖ్యంగా దేశంలోని మరి కొన్ని బ్యాంకులు తమ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులు అలాగే ఫైనాన్స్ కంపెనీలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా తమ కస్టమర్లకు అధిక రాబడిని అందించడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే కొత్త ప్రకటన ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉత్తమ హౌసింగ్ ఫైనాన్స్ పై ఫిక్స్డ్ డిపాజిట్ల వారికి వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల నుంచి ఏకంగా 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచి ఆనందాన్ని కలిగించింది. ఒకవైపు వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా కొత్త రేట్లు జూన్ 15 2022 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇక సుమారు 65 కోట్ల వరకు ఉన్న అన్ని రకాలు డిపాజిట్లకి కూడా ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.ఇక ఫిక్స్డ్ డిపాజిట్ రేటులో మార్పు తర్వాత మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ దాని టర్మ్ డిపాజిట్లపై ఏకంగా ఆరు శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీని కూడా అందించడానికి సిద్ధమైంది.
ఇక కొత్తగా పెంచిన వడ్డీ రేట్ల ప్రకారం 112 రోజుల నుంచి 23  నెలల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి 6 శాతం వడ్డీ లభిస్తుండటంతో ఇప్పుడు ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఐదు నెలల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.4 శాతం వార్షిక రాబడి కూడా లభిస్తుంది. కొత్త రేటు అమలులోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఏకంగా 8.3 8 శాతం నుంచి 10.14 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: