మనీ: ఆ బ్యాంకులో మీకు సేవింగ్ ఖాతా ఉందా..అయితే మీ కోసమే..?

Divya
ఆర్బిఐ ఒక నెలలోనే ఏకంగా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. ముఖ్యంగా అనేక బ్యాంకుల లోని ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక తాజాగా రెండు బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్ లో పై వడ్డీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇకపోతే గత వారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో.. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మళ్లీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం GDP అంచనాలను అనేక ఏజెన్సీలు కూడా సంభవిస్తున్నాయి ముఖ్యంగా ద్రవ్య సంస్థలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇకపోతే ఆర్బిఐ ఒక నెలలోనే ఏకంగా రెండుసార్లు వడ్డీరేట్లను పెంచింది.  కాబట్టి బ్యాంకులలోని ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ కూడా వడ్డీ రేట్లు పెంచనున్నట్లు సమాచారం. ఇకపోతే ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు తమ తమ ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్ లపై వడ్డీ రేట్లను పెంచాయి.
1. కోటక్ మహీంద్రా బ్యాంక్:
సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు.. వివిధ కాలవ్యవధికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తాజాగా కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రకటించింది. అయితే ఈ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం జూన్ 13వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కూడా ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా రూ.50 లక్షల కంటే ఎక్కువగా నిల్వలపై సంవత్సరానికి 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ కూడా లభిస్తుంది. ఇక ఈ వడ్డీ రేటు సంవత్సరానికి 3.5 శాతం ఉండగా తాజాగా మరో 0.5 శాతం పెంచి నాలుగు శాతానికి చేరుకుంది.
2. ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఆర్బీఐ రెపో రేటు పెంపు ఫలితంగా మరో ప్రైవేటు రంగ రుణదాత అయిన ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ సేవింగ్స్ అకౌంట్ లో వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. రూ.5 కోట్ల కంటే తక్కువ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై సుమారుగా 2.15 శాతం వడ్డీ రేట్లు తక్కువగా ఉంది. ప్రస్తుతం దానిని 2.75% పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: