ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్...ఇంటి నుండే లక్షల్లో లోన్స్ పొందే అవకాశం ?

VAMSI
ప్రముఖ బ్యాంక్ లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. అలాగే ఎక్కువ యాజర్లను సొంతం చేసుకున్న బ్యాంక్ లలో ఇది కూడా ఒకటని చెప్పాలి. కాగా తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన వార్తతో అందరినీ ఊరిస్తోంది. అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించి ఆశ్చర్యపరుస్తోంది. యోనో యాప్ ద్వారా 'రియల్ టైం ఎక్స్ప్రెస్ క్రెడిట్‌' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ బ్యాంక్ సంస్థ. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ తో బ్యాంక్ కు వెళ్ళకుండానే చాలా వరకు ట్రాన్సాక్షన్స్ వంటి పనులు కూడా బ్యాంక్ కు వెళ్ళకుండానే జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే పెద్దగా డాక్యుమెంట్స్ అవసరం లేకుండా అప్పు కోసం ఎవరి చుట్టూ తిరగకుండానే యాప్ ల ద్వారా లోన్ లు అందిస్తున్నాయి. ఇంటి వద్ద నుండే ఈ లోన్ లకు అప్లై చేసుకుని అందుకోవచ్చు.
 
కాగా ఇపుడు ఇదే తరహాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక నూతన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది . దీని ద్వారా బ్యాంకు సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర నుంచే పర్సనల్ లోన్‌ కు అప్లై చేసుకుని పొందే అవకాశం కల్పించింది. వ్యక్తిగత రుణం కోసం రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ తీసుకోవాలనుకునే వారు యోనో యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కాగా ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్  అవసరం. అయితే అర్హులైన కస్టమర్లకు డిజిటల్ పద్దతిలో డాక్యుమెంటేషన్ పూర్తయి క్షణాల్లోనే రూ. 35 లక్షల వరకు వ్యక్తిగత లోన్ మంజూరు అయ్యేలా చేస్తుంది బ్యాంక్. ఖాతాదారులకు సౌలభ్యాన్ని అందించడంతో పాటు వారికి డిజిటల్‌గా సాధికారత కల్పించడమే లక్ష్యంగా స్టేట్ sbi బ్యాంకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసింది. ఈ 'రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌'(RTXC) గురించి క్లియర్ గా వివరాలను అందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎస్‌బీఐ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.  ఈ యాప్ ను వినియోగించుకుని సదరు వ్యక్తులు లోన్ పొందవచ్చు.
ఇక ఈ యాప్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవక్సం ఎవరికి ఉంది అంటే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,  సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌, డిఫెన్స్ లో పనిచేసే వారు మాత్రమే  ఈ ప్రయోజనాన్ని పొందగలరని sbi స్పష్టం చేసింది. ఈ కేటగిరీకి చెందిన వారి ఇకపై వ్యక్తిగత రుణం కోసం బ్యాంక్‌ ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు... ఇంటినుండే లోన్ పొందే అవకాశం ఇపుడు అందుబాటులోకి వచ్చేసింది. క్రెడిట్ హిస్టరీ, అర్హత, డాక్యుమెంటేషన్ మొత్తం అన్ని కూడా రియల్ టైమ్‌లో డిజిటల్‌ పద్దతిలోనే చేస్తామని sbi వెల్లడించింది. అలాగే ఈ లోన్ లో వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువని తెలిపింది బ్యాంక్. మరి ఇంకెందుకు ఆలస్యం పర్సనల్ లోన్ కోసం వెయిట్ చేస్తున్న అర్హులు ఈ యాప్ ద్వారా లోన్ కి మీ ఇంటి దగ్గరనుండే అప్లై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: