మనీ: పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే సరికొత్త స్కీం.. ఏకంగా రూ.35 లక్షల వరకు లాభం..!!

Divya
సాధారణంగా చాలామంది డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఎన్నో రకాల పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంకులతో సమానంగా కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడిని అందిస్తూ మరింత దూసుకుపోతున్నాయి. అందుకే చాలా మంది రిస్క్ వుండదు కానీ ఖచ్చితమైన రాబడి వస్తుంది అని.. పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ కూడా ప్రస్తుతం ఒక అదిరిపోయే పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మీరు ఏకంగా రూ.35 లక్షల వరకు లాభాన్ని అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో పొందవచ్చు. మరి ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఇక పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న గ్రామ సురక్ష పథకం ద్వారా మీరు ప్రతి నెల కేవలం 1, 411 రూపాయలు ఆదా చేస్తే.. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత మీ చేతికి 35 లక్షల రూపాయలు లభిస్తాయి. ఇక ఈ పథకంలో చేరడానికి అర్హతలేమిటి..? ఎంత వడ్డీ వస్తుంది..? ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి..? ఇలా అన్ని పూర్తి విషయాలను పథకం గురించి మనం తెలుసుకుందాం. ఈ పథకంలో చేరాలనుకునే వారి వయసు కనిష్టంగా 19 సంవత్సరాలు,  గరిష్టంగా 55 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ పథకంలో  మీరు రూ.1000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు ప్రతి నెలకు లేదా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ప్రాతిపదికన ఇందులో డబ్బులు చెల్లించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీ ప్రీమియం 55 యేళ్లకు రూ.1,515 చెల్లిస్తే.. 58 యేళ్లకు రూ.1,463 చెల్లించాలి. అదే 60 యేళ్లకు రూ.1,411 చెల్లించాల్సి ఉంటుంది.60 సంవత్సరాల వయస్సులో మెచ్యూరిటీ మొత్తంగా మీరు ఏకంగా రూ. 34.60 లక్షలు పొందుతారు. అంతేకాదు నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: