మనీ: రూ.10 వేల పెట్టుబడి తో అదిరిపోయే లాభాలు..!!

Divya
ఇటీవలి కాలంలో చాలామంది ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అంతే కాదు కొంత డబ్బు ఉందంటే చాలు సొంతంగా వ్యాపారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీరు కూడా ఉద్యోగం ఇంట్రెస్ట్ లేక ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా.. ? అయితే ఈ వ్యాపారం ద్వారా మీరు డబ్బులను ఎక్కువగా సంపాదించాలని ఆలోచిస్తున్నట్లు అయితే మీ కోసమే ఒక బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకురావడం జరిగింది.ఈ ఐడియాను కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఆ బిజినెస్ ఏమిటంటే ఫుడ్ కేటరింగ్ బిజినెస్.. ప్రస్తుత కాలంలో ఈ బిజినెస్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న ఫంక్షన్ లు అయినా,  పెద్ద పెద్ద పెళ్లిళ్లు అయినా పుట్టుక మొదలు చావు వరకు ఇలా ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా చాలామంది క్యాటరింగ్ ఫుడ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అంటే పూర్తి వివరాలు కూడా ఒకసారి తెలుసుకోవాలి. క్యాటరింగ్ బిజినెస్ ను మొదలు పెట్టాలంటే కేవలం పది వేల రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇంత తక్కువ ఖర్చుతో మీరు బిజినెస్ మొదలుపెట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చు. మీ వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.

వ్యాపారం మొదలుపెట్టడానికి నిత్యావసర సరుకులు,  ప్యాకేజింగ్ కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిన వారికి క్యాటరింగ్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నట్లు చెబితే తర్వాత క్రమక్రమంగా మీకు ఆర్డర్లు రావడం మొదలవుతాయి. వంట చేయడానికి గ్యాస్ సిలిండర్, పాత్రలు, వంటసామాన్లు ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలి. ప్రారంభ దశలో తక్కువ లాభం పొందినా.. బిజినెస్ పెరిగేకొద్దీ మంచి లాభాలను పొందవచ్చు. ఇక ఎటువంటి కష్టం లేకుండా ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా చేసుకునే ఈ బిజినెస్ లో ఇప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: