మనీ: రూ. 300తో రూ.5 లక్షల వరకు ప్రయోజనం..!!

Divya
పేదరికం అనేది ప్రజలకు శాపం కాకూడదు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉన్నారో అలాంటి వారందరికీ తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ అందించే అవకాశాన్ని కల్పించబడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజి ని 40 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటే అందులో 10.74 కోట్ల కుటుంబాలు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా సుమారుగా 5 లక్షల రూపాయల వరకు వార్షిక ఆరోగ్య రక్షణ ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి రిటైల్ ధర దగ్గర ఆరోగ్య బీమా ను పొందలేని వారికి తక్కువ ప్రీమియం తో నే ఈ కవరేజ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నీతి ఆయోగ్ తో కలసి నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ పథకం కోసం రోడ్డు మ్యాప్ ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆయుష్మాన్ భారత్ పథకానికి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి సుమారుగా 1050 రూపాయలు ప్రీమియం చెల్లిస్తోంది . ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రతి వ్యక్తి కేవలం రూ.250 నుంచి 300 రూపాయల వరకు ప్రీమియం అందిస్తే సరిపోతుందట. ఒక కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులు ఉంటారు కాబట్టి కుటుంబం వార్షిక ప్రీమియం రూ. 1200 నుంచి 1500 రూపాయల వరకు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఇందులో ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. నేషనల్ హెల్త్ ఆధారిటీ మరికొన్ని నెలల్లో ఎంపిక చేసిన రాష్ట్రాలలో కూడా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని అడుగులు వేస్తోంది. ఈ పద్ధతి మొదలైతే సామాన్యులకు కూడా హెల్త్ కేర్ లభించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: