మనీ: రూ.165 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.20 వేలు మీ సొంతం..!

Divya
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇందులో మంచిగా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పథకాలలో డబ్బులు ఇన్వెష్ట్ చేస్తున్నారు. అంతే కాదు వీటి వల్ల ఇతర ప్రయోజనాలను కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పథకంలో డబ్బులు పెడితే మీకే మంచిది. ఎవరైనా సరే రిటైర్మెంట్ తర్వాత సమస్యలు లేకుండా ఉండవచ్చు. ఇక పూర్తి వివరాలు గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు రిస్కు కూడా ఏమీ ఉండదు. ఇక ఇందులో చేరిన వారు 60 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక తర్వాత ఒకేసారి భారీ మొత్తాన్ని మీరు పొందే ఆస్కారం అయితే ఉంటుంది. ఈ పథకం ద్వారా మీరు ప్రతి నెల పెన్షన్ పొందడంతోపాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక నేషనల్ పెన్షన్ సిస్టం ఇన్వెస్ట్మెంట్ లపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ సీ డి వన్ బి కింద 50 వేల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

ఇక 18 సంవత్సరాలు పైబడిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు.  కాబట్టి అరవై సంవత్సరాల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ప్రతిరోజు 165 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 22 వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇక మీరు ఇందులో 45 లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టినప్పుడు మీ చేతికి రూ. 65 లక్షలు పైగా వస్తుంది. ఇక 10 శాతం యాన్యూటీ ప్లాన్ ను పరిగణలోకి తీసుకుంటే ప్రతి నెల ఇరవై రెండు వేల రూపాయలు పెన్షన్ కింద పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: