మనీ: అమ్మ ఒడికి కొత్త ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం.!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లల చదువులు ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15000 రూపాయలు చొప్పున ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ డబ్బులు అందించే వారిపై కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. కుటుంబంలోని వారు విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడి వర్తించదట. ఆధార్ కార్డు లో తప్పకుండా కొత్త జిల్లాల పేర్లు నమోదు చేయించుకోవాలి. 75 శాతం పిల్లలు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మీ ఊరి వాలంటీర్ల వద్ద విద్యార్థుల పేర్లు వయసు సరిచేసుకోవాలి.
ఇక వచ్చే విద్యా సంవత్సరం నుండి అమ్మ ఒడి అర్హత ఎవరెవరికి ఉంటుందో ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సవివరంగా తెలియ జేయడం జరుగుతుంది. ఇక వీరికి రేషన్ కార్డు కూడా కొత్తది అయి ఉండాలి. ఇంటింటి సర్వే మ్యాప్ లో పిల్ల లేదా పిల్లవాడు తల్లి ఓకే మ్యాప్ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే విద్యార్థి యొక్క ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. తల్లుల బ్యాంకు ఖాతా నెంబర్ కు ఆధార్ లింక్ ను తప్పకుండా చేయించాలి. అంతేకాదు ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్ తో కూడా లింక్ చేయించడం తప్పనిసరి.
ఇక మరొక వైపు బ్యాంకు ఖాతా ఎప్పటికప్పుడు రన్నింగ్లో ఉండాలి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపు పన్ను కట్టే వాళ్లకు అమ్మఒడి ఏ మాత్రం వర్తించదు. ఇలాంటి వారు ఎవరైనా ఇప్పటికే అమ్మ ఒడి తీసుకొని ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేశారు. ఇకపోతే 44 లక్షల మంది అమ్మఒడి పథకం కింద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దీని కింద ఒక విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తూ ఉండగా అందులో 1000 రూపాయలను పాఠశాల యాజమాన్య నాయాల జీతాల కోసం తీసుకోవడం గమనార్హం మిగతా 14 వేల రూపాయలను పిల్లల తల్లుల ఖాతా లో వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: