మనీ: నెలకు రూ.10 వేల పెన్షన్ పొందాలంటే..ఇలా చేయండి..!!

Divya
చాలా మంది అధిక రాబడిని అందించే పథకాలను వెతికి మరి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక మీరు కూడా స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కగా లాభాలు రావడంతో పాటు మీరు రిటైర్మెంట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే మీరు రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా పెన్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు అయితే తప్పకుండా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ప్రస్తుతం మీరు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం లో గనుక డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎలాంటి రిస్క్ ఉండకపోగా అలాగే పెన్షన్ కూడా వస్తుంది.

నమ్మకమైన పెన్షన్ స్కీమ్ అని చెప్పవచ్చు. దేశీ దిగ్గజ బీమా కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ స్కీం కి సంబంధించి అన్ని బాధ్యత లను స్వయంగా తీసుకుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ కాలం 10 సంవత్సరాలు అంటే మీరు ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పది సంవత్సరాల వరకు ప్రతి నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం మీద 7.4 శాతం వడ్డీ రేటు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తోంది
ఈ పథకం లో చేరడానికి 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది.
వడ్డీ రేట్లు మాత్రం మార్చి 31 తర్వాత మారే అవకాశం కూడా ఉంటుంది..అందుకే మీరు ముందుగా చేరినట్లు అయితే 7.4 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే చేరడానికి అర్హులు అవుతారు. మీరు పెన్షన్ నెలవారి కావాలని ఎంచుకుంటే 7.4 శాతం వడ్డీ.. అదే మూడు నెలలకు అయితే 7.45 శాతం.. ఆరునెలల అయితే 7.52 శాతం అలాగే సంవత్సరానికొకసారి తీసుకున్నట్లయితే 7.66 శాతం వడ్డీ లభిస్తుంది. ఇకపోతే 60 సంవత్సరాలు ఉన్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు కాబట్టి 15 లక్షల రూపాయల వరకు మీరు గరిష్ఠంగా  ఇన్వెస్ట్ చేస్తే నెలకు 9,250 రూపాయల పెన్షన్ పది సంవత్సరాలపాటు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: