క్రెడిట్,డెబిట్ కార్డు వాడే వారు.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి..?

Divya
గతంలో పోల్చుకుంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ అలాగే డెబిట్ కార్డులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను కూడా చాలామంది వాడుతుండటం గమనార్హం. సాధారణంగా బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులు స్వయంగా డెబిట్ కార్డులను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . కానీ క్రెడిట్ కార్డులు మాత్రం అవసరం ఉన్నవారు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకున్న వారు దానిని ఉపయోగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నష్టాలను చవిచూడక తప్పదు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వాడకం విషయంలో జాగ్రత్త లేకపోతే సైబర్ నేరాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి.
అమాయకులను ఆసరాగా చేసుకొని క్రెడిట్,  డెబిట్ కార్డు వివరాలు తెలుసుకొని వారి అకౌంట్లను హ్యాక్ చేస్తూ డబ్బులను తీసుకుంటూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎలాంటి మోసాలు జరగకుండా ఉండడానికి కార్డులకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఇతరులతో పంచుకోవడం నేరం  అని బ్యాంకు యాజమాన్యం హెచ్చరిస్తోంది. ఇక క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ను హ్యాక్ చేయడానికి కేవలం ఆరు సెకండ్ల సమయం సరిపోతుంది అంటూ ఒక నివేదిక ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. ప్రముఖ గ్లోబల్ వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ అనే కంపెనీ డెబిట్ క్రెడిట్ కార్డుల హ్యాకింగ్ పై ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది.
ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్లైన్ లావాదేవీలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ నేరస్తులకు వరంగా మారింది అని నార్డ్ వీ పీ ఎన్ తెలిపింది. ఇకపోతే 140 దేశాల నుంచి సుమారుగా 40 లక్షల కార్డు పేమెంట్ లను పరిశీలించడం జరిగింది. బ్రూట్ ఫోర్స్ ద్వారా కేవలం ఆరు సెకండ్ల వ్యవధిలోనే కార్డులో ఉన్న డబ్బులను సులభంగా సైబర్ నేరస్థులు హ్యాక్ చేస్తున్నారని సూచించడం జరిగింది. అందుకే క్రెడిట్, డెబిట్ కార్డు వాడే వారు ఎప్పటికప్పుడు నెలవారీ స్టేట్మెంట్లను పరిశీలించాలి. బ్యాంకుల నుంచి వచ్చే సెక్యూరిటీ నోటిఫికేషన్లకు స్పందించాలి. మెసేజ్, ఫోన్ కాల్స్, ఈ మెయిల్ ద్వారా వచ్చే ఏ ప్రకటనలకు స్పందించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: