పింఛన్ దారులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్..!!

Divya
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఇప్పుడు తాజాగా వయసుపైబడిన వారి కోసం సరికొత్త చట్టాలను తీసుకు రావడం జరిగింది. ఎవరూ కూడా వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అన్న కారణంగా వృద్ధాప్య పింఛన్ తీసుకోని వారికి అతి పెద్ద శుభవార్త తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
కేవలం నెల రోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని ఇప్పటివరకు ఎవరైతే అర్హులై ఉండి కూడా పింఛన్ పొందలేకపోతున్నారు అలాంటివారు వెంటనే సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవాలని దరఖాస్తు పెట్టుకున్న మొదటి నెలే వృద్ధాప్య పింఛన్ వారి ఖాతాలో చేరిపోతుంది అని స్పష్టం చేశారు.. సూపర్ స్టార్ కృష్ణ వృద్ధాప్య పింఛన్ పొందే అరుపులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

ఇక సోమవారం శాసనసభలో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పద్దు పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పల్లెల ముఖచిత్రం మారిపోయిందని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ రాష్ట్రం లో 8, 690 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇప్పుడు  వాటిని 12,760 కి పెంచినట్లు మంత్రి ఆ సమావేశం లో వెల్లడించారు.
ఇక మొత్తంగా 3, 146 తాండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత కేవలం ఒక్క సీఎం కేసీఆర్ కి మాత్రమే  దక్కుతుందని ఆయన  స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్‌.
ఇక  బిజెపి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం కూడా  చాలా ఎక్కువ రెట్లు అని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అత్యధిక నిధులు ఇచ్చిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. రూ.67.40 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 13,650 ఎకరాల్లో 18,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: