ఎల్ఐసి పాలసీ దారులకు శుభవార్త..!!

Divya
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి రాబోతోంది. ఇక ఈ వారంలోనే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ను కంపెనీ వద్ద దాఖలు చేయాలని ఆలోచిస్తోంది.. ఇక ఈ నేపథ్యంలోనే ఎల్ఐసి పాలసీ దారులకు శుభవార్త తీసుకురానుంది. ఇకపోతే పాలసీ హోల్డర్లకు షేర్లను డిస్కౌంట్ రూపంలో ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎల్ఐసి.. వచ్చే పబ్లిక్ ఆఫరింగ్ లో ఎల్ఐసి తన పాలసీదారులకు 5 శాతం రాయితీ తో డిస్కౌంట్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు కూడా తెలియజేశాయి.. ఇక ఈ నెల 10న ఎల్ఐసి డి ఆర్ హెచ్ పి ను దాఖలు చేస్తున్నట్లు ఉద్యోగులకు, రిటైల్ బిల్డర్లకు కూడా ఐపీఓ ధరలలో కాస్త తగ్గింపు కూడా లభిస్తుంది అని వెల్లడించడం జరిగింది..
ప్రభుత్వరంగ బీమా సంస్థ ఈ వారంలో తన డి ఆర్ హెచ్ పి దాఖలు చేస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ తుహిన్  కాంతా పాండే తాజాగా వెల్లడించారు.. ఇకపోతే ఎల్ఐసి వాల్యూ రూ. 5 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఐపీఓ ద్వారా ఎల్ ఐ సి లో ఉన్న వాటాలను అమ్ముకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక కంపెనీ యొక్క ఐపీఓ విషయానికొస్తే.. ప్రభుత్వ వాటా లో ఈ సంస్థలు ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. డీ ఆర్ హెచ్ పి నే ప్రభుత్వ వాటాలను రివీల్ చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఐపీఓ ద్వారా ఐదు నుంచి ఏడు శాతం వాటాలను ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 65 వేల కోట్ల నుంచి రూ. 75 వేల కోట్ల వరకు లాభాలు పొందాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.. ఎవరైనా సరే ఎల్ఐసీలో షేర్ కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.. అంతే కాదు ఐదు శాతం రాయితీతో మనం షేర్లను కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: