క్రెడిట్ కార్డ్స్ వాడే వారు ఈ విషయం మరిచారా... మీ డబ్బు గోవిందా?

VAMSI
నేటి జీవితంలో రోజు రోజుకీ అన్ని ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు వారి పనులు చేసుకునే వారికి జీవించడం చాలా ఇబ్బందిగా మారుతోంది. వీలైతే పక్క ఇంటి వారిని లేదా స్నేహితులను అడిగి అప్పు తీసుకుని తమ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. మళ్లీ వీరి చేతిలో ఉన్నప్పుడు వారికి అమౌంట్ ను ఇస్తున్నారు. ఇలా చిన్న చిన్న అమౌంట్ అప్పు తీసుకున్న వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వీరి సంగతి వదిలేద్దాం. ఉద్యోగం చేసే వారు లేదా నెలకు జీతం వచ్చే వారు ఎవరైనా ఒక ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడపాలి లేదంటే చిక్కుల్లో పడడం ఖాయం అంటున్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు.
మామూలుగా పెరుగుతున్న ధరల కారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో  అధిక భారం పడుతోంది. వీటి వలన జీతాలు సరిపోని పరిస్థితి... ఇలాంటప్పుడు  ఆ ఖర్చులను మేనేజ్ చేయడానికి క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా క్రెడిట్ కార్డు లు వాడడం వలన తెలియకుండానే నష్టాలలో చిక్కుకుపోతున్నారు. అయితే ఇలా నష్టపోకుండా ఉండాలంటే కింద తెలిపిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని ప్రముఖులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సరిపోదు, దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. క్రెడిట్ కార్డ్ ల మూలంగా సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోయిన జాబితా ఎక్కువగానే ఉంది. ఈ నేరగాళ్ల దృష్టి అంతా కేవలం మొదటి సారి  క్రెడిట్ కార్డ్ పొందిన వారి మీదనే ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది.
ఇందుకోసం సదరు మోసగాళ్ళు వినియోగదారుడికి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని మీ క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేస్తున్నామని కార్డ్ వివరాలు, ఎక్స్పైరీ తేదీ లాంటి వివరాలను అడుగుతారు. ఈ వివరాలతో వారు మీ పాస్ వర్డ్ ను కనుక్కుంటారు. ఒక్కసారి వారికీ మీ పాస్ వర్డ్ తెలిస్తే ఇక మీ క్రెడిట్ కార్డు లిమిట్ అంతా వాడేస్తారు. మీతో ఎటువంటి ప్రమేయం లేకుండా మీ లిమిట్ ను వారే వాడుకుంటారు. ఇందుకోసం మీరు డైనమిక్ పాస్ వర్డ్ ను పెట్టుకోవడం మంచిది. ఇలా పెట్టుకోవడం వలన వాడిన ప్రతిసారి కొత్త పాస్ వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. దాని వలన మీరు సేఫ్ అవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: