మనీ: ఫిక్స్డ్ డిపాజిట్లపై గుడ్ న్యూస్ తెలిపిన ఎస్ బీ ఐ..!!

Divya

నిజం చెప్పాలంటే ఏదైనా పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తంలో మనకు నిర్ణీత కాలంలో డబ్బులు వస్తాయి అన్న విషయం తెలిసిందే. అందుకే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లపై మొగ్గు చూపారు. ప్రతి నెల డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉండేవారు ఒకే మొత్తంలో ఒకేసారి అనుకున్న మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల విషయంలో ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇకపోతే భారతీయ స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఖాతాదారులకు ఊరట కలిగించింది..

ఇకపోతే బేస్ రేటును వడ్డీ రేట్లపై..0.10% నుంచి 10 బేసిస్ పాయింట్ల మేరా పెంచుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన రేటు ప్రకారం..2021 డిసెంబర్ 15వ తేదీ నుంచి వార్షికంగా..7.55% వడ్డీ ఇవ్వనున్నారు. ఇకపోతే కేంద్రప్రభుత్వం కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించిన కనీస వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటు అమలు చేయడానికి బ్యాంకులకు అనుమతి లేదు. తమ ఫిక్స్డ్ డిపాజిట్లను మరింత పెంచుకోవడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్తగా రూ.2 కోట్లకు పైగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వారికీ ఈ  వడ్డీ రేట్లను పెంచుతూ అందరికీ శుభవార్త తెలిపింది.
అయితే రూ.2 కోట్ల కంటే దిగువన ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పై ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక ఏడు రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ కోసం.. ఇక సామాన్య ప్రజలకు 3.90% ఉండగా సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు 4.40% గా ప్రకటించారు. ఇక 46 రోజుల నుంచి 170 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి  సాధారణ ప్రజలకు అయితే..3.90%, సీనియర్‌ సిటిజన్లకు 4.40% గా ప్రకటించారు. ఇలా 120 రోజులకు, 180 రోజులకు.. సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఖాతాలపై వడ్డీ రేట్లు మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: