మనీ: ఈ స్కీమ్ లో చేరితే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

Divya
మధ్యతరగతి, అట్టడుగు వర్గాల వారు కోటీశ్వరులు కావాలనే ఆలోచన లేకపోయినా కనీసం లక్షాధికారి కావాలి అనే ఆలోచనతో పోస్ట్ ఆఫీస్ లో రకరకాల పథకాల లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పోస్టాఫీసులు ప్రవేశపెట్టే ఎన్నోరకాల పథకాలలో మనం ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ పోవడం వలన నిర్దిష్ట వ్యవధి తర్వాత లక్షల్లోనే మన చేతికి వస్తాయి అన్న విషయం తెలిసిందే. అయితే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వచ్చు. అయితే ఆ స్కీం లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?ఎంత ఇన్వెస్ట్ చేయాలి ..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఆదాయపు పన్ను చట్టం లో  సెక్షన్80 సీ కింద  సుమారుగా రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపును పొందవచ్చు. అయితే ఇందులో ఎటువంటి రిస్క్ లేదు కాబట్టి తప్పకుండా ఇందులో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల , అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీం పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది కావున  15 సంవత్సరాల మెచ్యూరిటీ కలిగిన ఈ పథకాన్ని అవసరమైతే మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు.

ఉదాహరణకు మీరు కనుక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ప్రతి నెల తొమ్మిది వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ 30 సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టడం వల్ల పథకం యొక్క నిర్ణీత సమయం ముగిసిన తరువాత , మీ చేతికి కోటి రూపాయలు అందుతాయి. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది కాబట్టి నిస్సందేహంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ కేవలం 30 సంవత్సరాల లోనే కోటీశ్వరులు అవ్వచ్చు. ఇలా ముందు జాగ్రత్తతో డబ్బులు దాచుకోవడం వల్ల భావితరాలకు భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: