మనీ: రూ.50 ఆదాతో రూ. 35లక్షలు మీ సొంతం..!!

Divya
పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఒకసారి ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేద మధ్య తరగతి వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఈ పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. ఇక అందులో భాగంగానే పోస్టల్ శాఖ తమ కస్టమర్లకు మెరుగైన రాబడిని అందించాలనే ఆలోచనతో ఇప్పుడు సరికొత్తగా, అందరికీ ఉపయోగపడే స్కీమును అమలు చేసింది.. సాధారణంగా పోస్టల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన కొన్ని స్కీం లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం కూడా పొందవచ్చు.

ముఖ్యంగా స్మాల్ సేవింగ్స్ స్కీం అమలు చేస్తుండటం గమనార్హం. ఇందులో చాలా తక్కువ పెట్టుబడితో నిర్ణీత కాలం ముగిసిన తర్వాత ఊహించని స్థాయిలో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఇప్పుడు పోస్టల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రామ సురక్ష స్కీం కూడా ఒకటి . ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం వల్ల మరణించిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ తో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.. ఇక ఈ స్కీంను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని కూడా పిలుస్తారు. ఇక వయసు విషయానికొస్తే 19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు.. సుమారుగా పదివేల రూపాయలు నుంచి 10 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.
మరో బెనిఫిట్ ఏమిటంటే, పాలసీ లో చేరిన తరువాత నాలుగు సంవత్సరాలకు లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అంతేకాదు ప్రతి వెయ్యి రూపాయలకు 60 రూపాయల బోనస్ కూడా లభిస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి రోజూ 50 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల నిర్ణీత సమయం గడిచిన తర్వాత మీ చేతికి 35 లక్షల రూపాయలు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం..! పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లకి వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: