మనీ: రూల్స్ మార్చిన కేంద్ర ప్రభుత్వం..!

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగేలా చూసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేరిట ఒక సరి కొత్త పెన్షన్ స్కీం చాలా సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా పెన్షన్‌ నిధి నియంత్రణ సంస్థ అయినటువంటి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) రూల్స్ ను మార్చింది..ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సరికొత్తగా పీఎఫ్‌ ఆర్డీఏ మార్చిన రూల్స్  ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన రూల్స్ ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద అదనంగా రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఎన్‌పీఎస్ ఖాతాలో జమ చేసిన డబ్బును కాలపరిమితి కంటే ముందే 25 శాతం వరకు పొందవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే డబ్బులో దాదాపు 60 శాతం వరకు పన్ను మినహాయింపు కూడా  వర్తిస్తుంది. కానీ కేవలం మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు మాత్రమే పన్ని వెచ్చించాలి.

ఇక నిర్ణీత గడువు కంటే ముందే ఎవరైనా ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితి వుండేది..కానీ ఇప్పుడు అది రూ.2.5 లక్షలకు పెంచడం జరిగింది.ఇక ఎన్‌పీఎస్‌లో చేరాలని అనుకునే వారు ఇప్పటివరకూ 65 యేళ్లు ఉండగా.. ఇప్పుడు దీన్ని 70 సంవత్సరాలకు పెంచారు. ఇక 65 సంవత్సరాల తరువాత ఎన్ పీ ఎస్ లో చేరితే మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఇకపోతే గతంలో ఎం పి ఎస్ నుంచి పెట్టుబడి పెట్టిన మొత్తం వెనక్కి తీసుకునే అవకాశం లేదు.

ఇప్పుడు తాజాగా మార్చిన రూల్స్ నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎవరైనా సరే  ఎన్‌పీఎస్‌ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా..ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. ఆ మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును  కూడా కేంద్రం కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: