మనీ: ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ఇలా చేయండి..!

Divya
డబ్బు ఎవరికైనా అవసరమే.. ఎలా సంపాదించాలి.. ఏం చేస్తే డబ్బు వస్తుంది.. అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మరికొంతమంది కొన్ని మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఇక మరికొంతమంది జ్యోతిష్యం ప్రకారం ఇలా చేస్తే డబ్బు వస్తుంది అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే ఇలా చేస్తే ధనవంతులు కావచ్చని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

మనకి డబ్బు రావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే.. స్నానం చేసి పవిత్ర మైన మనసుతో పూజ చేయండి. ఆ తరువాత అంతా మంచి జరుగుతుంది.. క్రమంగా ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు అని కొంతమంది చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పనిని ఆదివారం ఉదయం లేవగానే చేస్తే బాగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది.
ముఖ్యంగా ఆదివారం లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చేసి, ఆ తర్వాత పూజ చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందని తెలియజేస్తున్నారు. కాని సూర్యుడిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలట, అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
1). ముందుగా మనం నిద్ర లేచేటప్పుడు సూర్యుని కంటే ముందుగా నిద్రలేచి తలస్నానం చేయాలి.
2). ఇక ఆ తర్వాత మంచి బట్టలు వేసుకొని, పూజ చేయడం మొదలు పెట్టాలి. ఇక ఆ తర్వాత అందుకు సంబంధించిన మంత్రాలను చదువుకోవాలి.
3). ఇక అలా చేసిన రోజున శాకాహారమే తినాలి. మాంసాహారం జోలికి అసలు వెళ్ళకూడదు. ఇలా చేయండి..కాస్త కఠినంగా అనిపించినా కంపల్సరిగా చేయాల్సిందే.

ఈ నియమాలను పాటించడం వలన మనలో క్రమశిక్షణ పెరిగి, ఆ తర్వాత ఎన్నో మార్గాల గుండా డబ్బు ఆదా అవుతుందని కొంతమంది జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటివి చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది పండితులు సూచిస్తున్నారు. ఇక ప్రతి రోజు పూజ చేయడం వల్ల కూడా ఎంతో మనశ్శాంతితో ఉంటారని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: