మనీ : హోమ్ లోన్ కి ఏ బ్యాంకు ఎంత వడ్డీ.

Divya
.
సాధారణంగా హోమ్ లోన్ తీసుకునే వారికి ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా వడ్డీరేట్లను విధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఏ బ్యాంకులో ఎంత వడ్డీ పడుతుందో , తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వడ్డీరేట్లను కూడా తగ్గించి ఇస్తున్నాయి. ఇకపోతే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలా ఎన్నో నష్టాలను ప్రజలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆర్థికంగా నష్టపోయిన విషయాలను దృష్టిలో పెట్టుకొని, bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను భారీగా తగ్గించిందని చెప్పవచ్చు. రెపో రేటు కూడా భారీగా  తగ్గడంతో, చాలా బ్యాంకులు కూడా వడ్డీరేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే 2019 సంవత్సరం సెప్టెంబర్ నాటికి హోమ్ లోన్ పై వడ్డీరేటు 8.5 శాతం వరకు ఉండేది. అయితే దానిని ఇప్పుడు ఏకంగా 6.49 శాతం 6.95 శాతానికి భారీగా తగ్గించిందని ప్రకటన కూడా చేసింది. 16 బ్యాంకులు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా సుమారుగా రూ. 75 లక్షల వరకు ఈ వడ్డీ రేటును అమలు చేయడం గమనార్హం.
ఇందులో ప్రైవేట్ రంగ దిగ్గజాలైన కొటక్ మహేంద్ర బ్యాంక్, ఇక ప్రభుత్వ రంగంలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లు తమ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల ద్వారా ఎవరైతే హోం లోన్  తీసుకోవాలనుకుంటున్నారో,  అలాంటివారికి 6.65 శాతం వడ్డీని విధించింది . ఇక దేశీయ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి ఎస్బిఐ లో 6.95%, హెచ్డిఎఫ్సి లో ఏడు శాతం గా ప్రకటించడం జరిగింది. ఈఎంఐ ద్వారా హోమ్ లోన్ చెల్లించిన వారికి ఈ రేట్లు అత్యధిక అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: