మనీ : వామ్మో అంత పెట్టి కంట్రీ క్లబ్ ను సొంతం చేసుకున్న ముకేష్ అంబానీ..!

Divya

కంట్రీ క్లబ్ గురించి పెద్దగా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇది బ్రిటన్ లోని  రెండవ తరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీ క్లబ్ గా పేరుప్రఖ్యాతులు పొందింది . దీని పేరు స్టోక్ పార్క్.. ఇటీవల ఈ కంట్రీ క్లబ్ ను  వేలంపాటలో  నిర్వహించగా  , పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజ అధినేత అయిన ముకేశ్ అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంట్రీ క్లబ్ ను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ కి చెందిన ప్రతిష్టాత్మక కంట్రీ క్లబ్ గోల్ఫ్  రిసార్ట్ అయిన స్టోక్ పార్క్ ను  57 మిలియన్ పౌండ్ల కు కొనుగోలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 592 కోట్ల రూపాయలు అన్నమాట..
ఇక ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హోర్డింగ్స్ లిమిటెడ్ ( ఆర్ ఐ ఐ హెచ్ ఎల్ ),  కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్చేంజి లకు తెలియజేసింది . ఈ ఒప్పందంపై సంతకం కూడా చేసింది.. ఇది ముఖ్యంగా ఆతిథ్య రంగంలో కార్యకలాపాల విస్తరణకు రిలయన్స్ కి  ఈ డీల్ బాగా ఉపయోగపడుతుంది.  ఇక అంతే కాకుండా రిలయన్స్ కి ఇప్పటికే ఈ ఐ హెచ్ లిమిటెడ్ ఒబెరాయ్ హోటల్స్లో కూడా గణనీయంగా వాటాలు ఉండడం విశేషం.
ఇక వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు , రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ , మీడియా, టెలికం రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో 6 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకున్న కంట్రీ క్లబ్ అయిన స్టోక్ పార్క్ లో లగ్జరీ స్పా హోటల్, గోల్ఫ్ కోర్స్, కంట్రీ క్లబ్ బంకింగ్ హామ్ శైర్  300 ఎకరాల్లో ఇది విస్తరించి ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: