డబ్బే డబ్బు : కరోనా దెబ్బతో మళ్ళీ పెరిగిన కరెన్సీ చలామణి !
గత ఏడాది మార్చినాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 24 లక్షల కోట్లు అయితే ఇప్పుడు కేవలం 9 నెలలలో కరెన్సీ చలామణి 13 శాతం పైగా పెరగడం వెనుక గల కారణం కోవిడ్ పరిస్థితులు మాత్రమే అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా దేశంలో చలామణిలో ఉన్న నోట్లల్లో 80 శాతానికి పైగా 500 – 2000 నోట్లలోనే ఉండటంతో ప్రజలు ఈ పెద్ద నోట్లకే ఆశక్తి కనపరుస్తున్నారని తెలుస్తోంది.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా గత వారం ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈవారం ప్రారంభం కూడ షేర్ మార్కెట్ లో జోష్ కనిపించింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకాలు పంపిణీ మొదలవుతున్న పరిస్థితులలో ఆ టీకా ఫలితాలను బట్టి షేర్ మార్కెట్ మరింత పరుగులు తీయవచ్చని అంచనాలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈవారం ఔషద బ్యాంకింగ్ షేర్లు బాగా రాణిస్తే లోహ గనుల కంపెనీల షేర్లు నెమ్మదిగా కదలాడుతాయని అన్న అంచనాలు ఉన్నాయి. టిసీఎస్ ఫలితాను అంచనాలు మించి రావడంతో ఆ కంపెనీ షేర్లతో పాటు ఈవారంలో విడుదలయ్యే ఇన్ఫోసిస్ విప్రో హెచ్ సిఎల్ కంపెనీల ఫలితాల పై ఈ షేర్ల పరుగులు ఆధారపడి ఉంది. దీనికితోడు టెలికంపెనీల షేర్లు అదేవిధంగా సిమెంట్ కంపెనీల షేర్లు కూడ ఈవారం అంతా రాణించే ఆస్కారం కనిపిస్తోంది..