డబ్బే డబ్బు : డబ్బును బధ్రపరుచుకునే పర్స్ ను సక్రమంగా పెట్టుకోలేనివాడు సంపన్నుడు కాలేడు !

Seetha Sailaja
సాధారణంగా ప్రతి వ్యక్తి జేబులో ఉండే పర్స్ మామూలు విషయమే అయినప్పటికీ ఆ పర్స్ ను ఒక వ్యక్తి ఎంత అందంగా మెయిన్ టైన్ చేస్తున్నాడు అన్న విషయాన్ని బట్టి అతడు దానానికి ఇచ్చే ప్రాధాన్యత అంచనా వేయవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి పర్స్ ను చాల నిశితంగా పరిశీలిస్తే ఆ పర్స్ లో అనేక విజిటింగ్ కార్డ్స్ తో పాటు ఆ పర్స్ యజమాని ఆర్ధిక స్థితిని బట్టి ఆ పర్స్ లో ఉండే క్యాష్ ఉంటూ ఉంటుంది.


అయితే ఆ పర్స్ లో ఉండే క్యాష్ ఇష్టం వచ్చినట్లు పెట్టుకున్నట్లు కనిపిస్తే అలాంటి పర్స్ కలిగిన వ్యక్తి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వని దుబారా మనిషి అని అర్ధం అవుతుంది. అందుకే పర్స్ ను గజిబిజిగా ఉంచుకునే వ్యక్తి జీవితం కూడ చాల గజిబిజిగా ఉంటుంది.


పర్స్ లో చిందరవందరగా డబ్బు పెట్టుకున్న వ్యక్తి జీవితం కూడ చాల కన్ఫ్యూజ్ గా ఉంటుందని అలాకాకుండా పర్స్ లోని క్యాష్ ను ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్న వ్యక్తి డబ్బుకు విలువ ఇచ్చే వాడని అర్ధం. అంతేకాదు మన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బు విషయమై ఎంత జాగ్రత్తగా ఉంటామో మన పర్స్ లో ఉన్న డబ్బు విషయంలో కూడ అంతే జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి దగ్గరే డబ్బు వచ్చి చేరుతుంది అని అంటారు.


పర్స్  లో ఉన్న డబ్బు పట్ల అప్రమత్తంగా ఉంటూ మన ఇంటి నుండి ఎంత బయటకు తీసుకువెళ్ళాము అ డబ్బులో ఎంత ఖర్చు పెట్టాము అని లెక్కలు వేసుకున్న వ్యక్తి దగ్గరే డబ్బు వచ్చి చేరుతుంది అని అంటారు. ఒక వ్యక్తి నిజమైన బలం బలహీనత కూడా డబ్బు మాత్రమే. అందువల్ల ఆ డబ్బును ఒక క్రమ పద్ధతిలో వాడుతూ డబ్బు పట్ల గౌరవం చూపించగల వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలడని మనీ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: