డబ్బే డబ్బు : షాకింగ్ వ్యాపార అవినీతిలో భారత్ 77వ స్థానం !

Seetha Sailaja
భారత్ కరోనా పరిస్థితులను కూడ లెక్క చేయకుండా అభివృద్ధి చెందుతోంది అని వస్తున్న వార్తలు చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంటే ప్రపంచదేశాల అవినీతి సూచీలో భారత్ 77వ స్థానాన్ని దక్కించుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘ట్రేస్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 194 దేశాలలోని వ్యాపార అవినీతి తీవ్రతను పరిశీలించి విడుదలచేసిన ఈసంవత్సరం నివేదికలో భారత్ 77వ స్థానంలో నిలిచింది.


గత సంవత్సరం ఇదే సంస్థ చేసిన సర్వేలో భారత్ 78వ స్థానంలో ఉంటే ఈసంవత్సరం 3 పాయింట్లు తగ్గించుకుని 77వ స్థానంలో నిలిచింది. అయితే మన పోరుగుదేశం మనదేశం కంటే ఆర్ధికంగా చాల వెనుకపడిన దేశం భూటాన్ ఈ అవినీతి సూచీలో 48వ స్థానాన్ని దక్కించుకుంటే ఎంతగానో అభివృద్ధి చెందిన భారత్ ఇప్పటికీ అవినీతి రహిత దేశంగా ఎదగలేకపోతోంది.


వ్యాపార అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలలో డెన్మార్క్ న్యూజిలాండ్ స్వీడన్ లాంటి చిన్న దేశాలుగా మారుతున్నా మనదేశం మటుకు అవినీతి విషయంలో ఇంకా ఈ సూచీలో అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా కరోనా కష్టాలు కొంతమటుకు సద్దుమణిగి పెద్ద వ్యాపారాలు గాడిన పడుతున్నా భారత్ లో ఇప్పటికీ చిన్న వ్యాపారులు ఈ కరోనా వ్యతిరేక వ్యాపార పరిస్థితుల నుండి ఇంకా కోలుకోలేకపోతున్నారని నివేదికలు వస్తున్నాయి.


చిన్నతరహా మధ్యతరహా వ్యాపారులు ఇంకా పెట్టుబడుల విషయమై చాల ఇబ్బందులు పడుతున్నారని ఇదే కొనసాగితే వచ్చే ఏడాదికి కరోనా అనంతర కాలంలో బాగా దెబ్బతిన్న ప్రధాన ఆర్ధిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఉండే ఆస్కారం ఉంది అంటూ అంతర్జాతీయ ఆర్ధిక సేవా సంస్థ హెచ్ ఎస్ బిపి హోల్డింగ్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన నివేదికలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా కరోనా పరిస్థితులు వల్ల మధ్య తరగతి ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో ఖర్చులు తగ్గడం వల్ల గత ఆరు నెలలలో స్మాల్ సేవింగ్స్ పదకాలలో పెట్టుబడులు సుమారు లక్ష కోట్లు పెరగడం ఒక విధంగా పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: