డబ్బే డబ్బు : మెరుగు పడుతున్న హైరింగ్ సెంటిమెంట్ రాబోతున్న ఉద్యోగ అవకాశాలు !
ప్రస్తుతం భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుతం కలవర పాటుకు గురిచేస్తున్న పరిస్థితులలో అనేక ప్రముఖ కంపెనీల ఆదాయం తగ్గిపోతూ ఉండటంతో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య పై కూడ కోతలను పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రావడం కష్టం అన్న అబిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే ఇలాంటి నెగిటివ్ పరిస్థితులలో కొన్ని రంగాలకు సంబంధించి హైరింగ్ సెంటిమెంట్ పెరుగుతోంది అని ‘టీమ్ లీజ్ ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ రిపోర్ట్’ వెల్లడించిన విషయాలు ఇప్పుడు అనేకమంది యువతకు ఈ కరోనా సమయంలో కూడ ఆశలను కల్పిస్తోంది. లాక్ డౌన్ సమయంలో 86 శాతం వరకు క్షీణించిన హైరింగ్ సెంటిమెంట్ ఇప్పుడు అన్ లాక్ డౌన్ ప్రారంభించిన తరువాత క్రమేణా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆ నివేదిక అభిప్రాయ పడింది.
ప్రస్తుతం హెల్త్ కేర్ ఫార్మా ఇండస్ట్రీలలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని ఈ రంగాలు తరువాత ఈ కామర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసస్ టెలీకమ్యూనికేషన్స్ ఐటీ నిత్యావసర చిల్లర వర్తకం వ్యవసాయం ఆగ్రో కెమికల్స్ పవర్ అండ్ ఎనర్జీ రంగాలలో ఈ సంవత్సరం చివరకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ఈనివేదిక వెల్లడించింది. దీనితో ఈ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకునే వారికి మంచి అవకాశాలు రాబోతున్నట్లు ఆ నివేదిక ఆశలు కలిపిస్తోంది.
దీనికితోడు ప్రస్తుత కరోనా సంక్షోభం నేపద్యంలో కార్పోరేట్ కంపెనీలు అన్నీ నిరుత్సాహ పడకుండా తమ కంపెనీల వ్యాపారాలకు సంబంధించి అభివృద్ధి పై ఈ నెగిటివ్ పరిస్థితులలో కూడా దృష్టి పెడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ సంవత్సరాంతానికి మనదేశంలో 40 వేలకోట్ల ఔషదాలు తయారీకి మార్గం సుగమం కావడంతో ప్రస్తుతం ఈ కంపెనీలు అన్నీ తమ హైరింగ్ సెంటిమెంట్ మెరుగుపరుచుకుని కొత్త ఉద్యోగాల కల్పన వైపు అడుగులు వేయడం శుభ సూచికం..