విజయ్ దళపతిలానే విడాకులు తీసుకోబోతున్న తెలుగు స్టార్ హీరో..!?

Thota Jaya Madhuri
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలు మరింతగా చర్చకు వస్తున్నాయి. గతంలో ఆయన గురించి ప్రధానంగా సినిమాల పరంగా మాత్రమే వార్తలు వచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు… ఈ రెండింటితో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తరచూ బయటకు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విజయ్ గురించి చర్చలు మరింతగా పెరిగాయి.

ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ కుటుంబానికి సంబంధించిన ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా ఆయన భార్య గురించి వచ్చిన వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. విజయ్ భార్య తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం అధికారికంగా కూడా ప్రకటించింది.  విజయ్ ఒక నటితో ఎక్కువగా దగ్గరగా ఉంటున్నాడనే అనుమానం తనకు కలిగిందని, ఎంత చెప్పినా ఆమెతో దూరంగా ఉండడం లేదని విజయ్ భార్య చెప్పుకొచ్చింది. అదే కారణంగా ఇక తనతో కలిసి జీవించడం కష్టమని నిర్ణయించుకొని, దూరంగా ఉండాలని భావించిందట. అంతేకాకుండా తనకు ఎవరైనా అన్యాయం చేస్తే ఆ యువతి పేరు కూడా బయట పెట్టేందుకు వెనుకాడనని ఆమె స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత విజయ్ కూడా చాలా కాలం పాటు పెద్దగా ప్రజల్లో కనిపించలేదు. సాధారణంగా ఆయన సినిమా కార్యక్రమాలు లేదా ఇతర ఈవెంట్లలో కనిపించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన పబ్లిక్ అపియరెన్సులు కొంచెం తగ్గినట్లుగా అభిమానులు గమనించారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇలాంటి సమయంలో ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో విజయ్ కనిపించడం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యక్తి కళాపతి సురేష్ మరియు మీనాక్షి సురేష్ కుమారుని వివాహానికి విజయ్ హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ వివాహానికి హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

విజయ్ మరియు త్రిష ఇద్దరూ కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మరోసారి వీరిద్దరి గురించి పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు ఇది సాధారణ విషయం అని భావిస్తుండగా, మరికొందరు మాత్రం వివిధ రకాల కథనాలు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఒక స్టార్ హీరో గురించి ఇలాంటి వార్తలు వినిపించడం ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఒక నటుడు కూడా కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతగాడు కూడా విజయ్ లాగే విడాకులు అంటూ షాక్ ఇస్తాడు ఏమో అనుకుంటున్నారు జనాలు. కొంతమంది సినీ విశ్లేషకులు, అభిమానులు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ పేరు, త్రిష పేరు, అలాగే టాలీవుడ్ స్టార్ హీరో గురించి వినిపిస్తున్న వార్తలు సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: