నాని ఫుల్ ఇంప్రెస్.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసల వర్షం...!

Amruth kumar
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. వరుసగా ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి హ్యాట్రిక్ హిట్లతో రచ్చ చేసిన నాని, రీసెంట్‌గా ‘హిట్: ది థర్డ్ కేస్’ తో ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటాడు. కేవలం హీరోగానే కాకుండా, ‘కోర్టు’ సినిమాతో నిర్మాతగానూ సాలిడ్ హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు తన దృష్టినంతా మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ది ప్యారడైజ్’ (The Paradise) పై పెట్టాడు.



‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ సినిమా వాస్తవానికి ఈ మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పనులు మరికొంత బాకీ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో సినిమాను అనూహ్యంగా వాయిదా వేశారు.ప్రస్తుతం నాని ఈ సినిమా షూటింగ్‌లో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెప్పాయి. దసరాను మించిన ‘మాస్’ ట్రీట్ ఈ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.



ఒకవైపు తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, తోటి హీరోల సినిమాలను ప్రోత్సహించడంలో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. నేడు (మార్చి 6, 2026) విడుదలైన శ్రీవిష్ణు కొత్త సినిమా ‘మృత్యుంజయ్’ చూసిన నాని, సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. "శ్రీవిష్ణు నటన నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ కామెడీతో నవ్వించే విష్ణు, ఈ సినిమాలో సీరియస్ పాత్రలో అదరగొట్టాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు నన్ను కట్టిపడేసింది" అని నాని పేర్కొన్నాడు.తొలి ప్రయత్నంలోనే కొత్త కంటెంట్‌తో వచ్చిన దర్శకుడు సందీప్ గుణ్ణంకు అడ్వాన్స్డ్ గా బ్లాక్ బస్టర్ విషెస్ చెప్పేశాడు నాని. ఇలాంటి కొత్త దారిలో సినిమాలు రావడం ఇండస్ట్రీకి చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.



ఈరోజు విడుదలైన ‘మృత్యుంజయ్’ సినిమాకు నాని సపోర్ట్ తోడవ్వడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. శ్రీవిష్ణు గత వారం ‘విష్ణు విన్యాసం’తో పలకరించగా, ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో డీసెంట్ టాక్ సొంతం చేసుకుంటున్నాడు.ది ప్యారడైజ్’ విడుదల తేదీ మారినా, నాని మాత్రం తన మార్క్ ప్రమోషన్లు, సినిమాల సెలక్షన్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల మ్యాజిక్ మరోసారి రిపీట్ అయితే, నాని మార్కెట్ రేంజ్ ఎక్కడికో వెళ్లడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: