అలాంటి ఫోటోలు షేర్ చేస్తే తప్పేముంది.. దీపికా పదుకునే..!.

Anilkumar
దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొనడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఈమె చేస్తున్న కొన్ని కామెంట్స్ మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి అని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈమె మాట్లాడే మాటలు సెక్స్ న్యూడిటి గురించే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఆమె ఈ విధంగా మాట్లాడే మాటలు ఆమె ఫ్యాన్స్ కి సైతం నచ్చడం లేదు. దీంతో ఆమె ఫాన్స్ అయితది దీపికా పడుకునేపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కదీపిక పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. 

ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నందుకుగానూ హాలీవుడ్ మీడియా సంస్థలకు కూడా ఇంటర్వ్యూలో ఇస్తూ బిజీగా ఉంది ఈ బాలీవుడ్ బ్యూటీ .అయితే గతంలో ఆమె భర్త రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి దుమారం రేపిన సంగతి కి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆయన చేసిన పనికి ఏకంగా కోర్టులో కేసు సైతం నమోదయింది. కానీ ఆ సమయంలో దీపికా తన భర్తను చాలా సపోర్ట్ చేసింది .ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మరోసారి ఈ ఫోటోలపై కొన్ని రకాల ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి. దానికి ఊహించిన విధంగా సమాధానం ఇచ్చింది దీపిక పదుకొనే.

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ఒకరి ఇష్టాలను మనం ఎప్పుడూ గౌరవించాలి వారి ఇష్టాలను మనం సమర్ధించకపోయినప్పటికీ పర్వాలేదు.. గానీ అసలు వ్యతిరేకించకూడదు.. ఆ అర్హత మనకు లేదు.. నేను కూడా అదే చేశాను.. నా భర్తను నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను.. అయినా గతంలో చాలామంది న్యూడ్ ఫోటో ఫోటోలను చాలామంది షేర్ చేశారు.. అప్పట్లో అలాంటి ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు.. అందరూ మౌనంగానే ఉన్నారు.. కానీ నా భర్త విషయంలో మాత్రం అలా చేయలేదు. రచ్చ రచ్చ చేశారు అసలు నా భర్త అలా చేయడంలో తప్పేముంది... ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా.. అంటూ తన భర్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది దీపిక పదుకొనే. దాంతో మరోసారి దీపికా పడుకొని పై విమర్శలు కురిపిస్తున్నారు నేటిజన్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: