పవన్ కళ్యాణ్ సినిమాకి నిర్మాతగా యాంకర్ ప్రదీప్..!?

Anilkumar
బుల్లితెర యాంకర్లలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు ప్రదీప్. ప్రస్తుతం డి షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు ప్రదీప్ .ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చేసే సందడి కోసమే ఢీ షో చూసే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇందులో సుడిగాలి సుధీర్ మరియు ప్రదీప్ వీరిద్దరి కాంబినేషన్ చూస్తే కడుపు బా నవ్వుకోవాల్సిందే. ఢీ షో తో పాటు మరెన్నో షోలకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈయన.ఇక జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా

అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు ప్రదీప్. అయితే ఈ షోలో తనకున్న పలుకుబడితో టాలీవుడ్ స్టార్ హీరోలో మరియు స్టార్ హీరోయిన్లతో అందరితో టచ్ లో ఉంటాడు ప్రదీప్ .గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. హీరోగా ఈ సినిమాలో నటించినప్పటికీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. అలా హీరోగా యాంకర్ గారి నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకుంటూ బిజీ జీవితాన్ని గడుపుతున్నాడు ప్రదీప్. అయితే అసలు విషయం ఏంటంటే ప్రదీప్ కి మరొక కోరిక కూడా ఉందంట.

అదేంటంటే ఒక సినిమాని నిర్మించాలని కోరిక ఉందట. ఇక తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే నిర్మిస్తానని అంటున్నాడు ప్రదీప్ .ఇక ఆ మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆయనతో ఒక్క సినిమా చేయాలంటే వందల కోట్ల రూపాయలతో బిజినెస్ చేసినంత లెక్క. ఒక సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ కోట్లల్లో ఉంటుంది. అలాంటిది అంత తేలికగా ప్రతి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అంటే ఈ వార్త విన్న వారందరూ షాక్ అవుతారు. దీంతో ప్రదీప్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలని ఉంది అని తన మనసులోని కోరికను బయట పెట్టడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వారు అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: