భోళా శంకర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రస్తుత చిత్రం భోళా శంకర్. ఈ సినిమా చివరి షెడ్యూల్ మాత్రమే షూటింగ్ మిగిలినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ మెహర్ రమేష్ వీలైనంత త్వరగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. అయితే మరొకవైపు ఈ సినిమా కు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా వేగవంతంగా చిత్ర బృందం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని స్పెషల్ పోస్టర్లను కూడా విడుదల చేస్తూ మంచి హైప్ ఏర్పడేలా చేస్తోంది.

భోళా శంకర్  సినిమాకు సంబంధించి పాటలను ఎప్పుడు విడుదల చేస్తారా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రావడం లేదు.. మొన్నటి వరకు చిత్ర బృందం ఆలస్యం చేస్తుందని కామెంట్లు వినిపించాయి.. కానీ మొత్తానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా నిన్నటి రోజున ఒక అప్డేట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.భోళా శంకర్  సినిమా భోళా మేనియా త్వరలోనే మొదలవుతుంది అంటు మెగాస్టార్ స్టైలిష్ స్టిల్స్ లో ఉన్నటువంటి ఒక పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

గత సినిమాల పాటలు కూడా బాగానే సక్సెస్ అయ్యాయి ఇక ఇప్పుడు చిరంజీవితో మహతి స్వర సాగర్ కాంబినేషన్ లో సాంగ్స్ ఎలా ఉంటాయి అనే విషయంపై ఇంకా ఆసక్తి నెలకొంది. భోళా శంకర్  సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు అయితే ఆ మధ్య ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు అయితే వినిపించాయి. కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్లు రిలీజ్ డేట్ క్లారిటీ ఇవ్వడంతో సినిమా విడుదల విషయంలో వాయిదా లేదని క్లారిటీ రావడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా చిరంజీవి చెల్లెలి పాత్రలు కీర్తి సురేష్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: