కమలహాసన్ తో రజనీకాంత్ చిత్రం..!!

Divya
తమిళ స్టార్ హీరోలలో కమలహాసన్, రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ వయసులో కూడా ఫుల్ స్పీడ్ గా సినిమాలను తెరకెక్కిస్తే తనదైన స్టైల్ విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేసి మంచి సక్సెస్ అవుతున్నారు. కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నారు ఆ తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా అయిపోయిన వెంటనే శివ కార్తికేయన్ తో, శింబుతో తదుపరి చిత్రాలను నిర్మాతగా నిర్మించబోతున్నట్లు సమాచారం.
రజినీకాంత్ మాత్రం ఈసారి రెండు సినిమాలలో నటిస్తూ అదరగొట్టేస్తున్నారు ఒకటి డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాతో పాటు తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో లాల్ సలాం అనే చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే తర్వాత రజనీకాంత్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ ఒక సినిమా చేయబోతున్నారంటూ కమలహాసన్ కన్ఫామ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది కమలహాసన్.
అయితే ఈ ప్రాజెక్టులో లోకేష్ కనుక రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి డైరెక్టర్ ఎవరు అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రాబోతోందని తెలుస్తోంది. జైలర్ సినిమాని ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక కమలహాసన్ నటించిన ఇండియన్-2 సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఇండియన్ -2 సినిమా కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కమలహాసన్ రజనీకాంత్ కలసి సినిమా నిర్మించడంతో అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: