భోళా శంకర్ : మ్యూజిక్ మ్యానియా షురూ.. ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ నటిస్తున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కోల్ కత్తాలో ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తమిళంలో హిట్ అయిన అజిత్ 'వేదాళం' సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా..  కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ను అందించారు. 'భోళాశంకర్ పాటల సందడికి సమయం ఆసన్నమైందంటూ మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. 'భోళా శంకర్' మ్యూజిక్ మ్యానియా వచ్చేస్తోంది అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేశారు. పోస్టర్లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. దర్శకుడు మెహర్ రమేష్ సుమారు 10 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పడుతూ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

మెగాస్టార్ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ రీమేక్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేశాడట ఈ దర్శకుడు. ఈ సినిమాతో కచ్చితంగా మెగాస్టార్ సాలిడ్ హిట్ ఇవ్వాలని తను కూడా మంచి కం బ్యాక్ పొందాలని స్క్రిప్ట్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంపై మూవీ టీం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మెహర్ రమేష్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం 'షాడో'. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక షాడో తర్వాత ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్ చేయలేదు మెహర్ రమేష్.  మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 'భోళా శంకర్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా మెహర్ రమేష్ కి అలాగే మెగాస్టార్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: