లగ్జరీ కార్ కొన్న అజయ్ దేవగన్.. రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకు కార్ల పిచ్చి ఉన్న మాట వాస్తవం. మార్కెట్లో ఏదైనా కొత్త కారు వచ్చిందంటే చాలు ఆ కార్ ని ఎప్పుడెప్పుడు కొనాలా అంటూ సెలబ్రిటీలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక వెంటనే ఆ కార్ ని కొనేసి తమ గ్యారేజీలో పెట్టేస్తారు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ కూడా ఇప్పుడు ఇదే చేశాడు. అజయ్ దేవగన్ లేటెస్ట్ గా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు అజయ్ దేవగన్. దీని ధర సుమారు రెండు కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ బీఎండబ్ల్యూ ఐ సెవెన్ (BMW i7) ఎలక్ట్రిక్ కారు జర్మన్ ఆటోమేకర్ లైనప్ లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.

ఇక ఈ కారు ఫీచర్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక ఇదే కార్ ని ఇటీవల బాలీవుడ్ లో కొంతమంది సినీ సెలబ్రిటీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అజయ్ దేవగన్ కూడా ఈ కారుని కొనుగోలు చేయడంతో ఆయన అభిమానులు ఈ విషయం తెలిసి సోషల్ మీడియా వేదికగా అజయ్ దేవగన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర నటుడిగా కొనసాగుతున్న అజయ్ దేవగన్ గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ హిట్ ఖైదీ సినిమాని బాలీవుడ్ లో 'భోళా' అనే పేరుతో రీమేక్ చేశాడు అజయ్ దేవగన్.

ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అజయ్ దేవగన్ దర్శకత్వం వహించడం విశేషం. టి సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లతో కలిసి అజయ్ దేవగన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాడు. ఈ సినిమాలో టబూ, అభిషేక్ బచ్చన్, లక్ష్మీరాయ్, అమలాపాల్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం అజయ్ దేవగన్ బాలీవుడ్లో 'మైదాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టి సిరీస్ మారుతి ఇంటర్నేషనల్ హానర్ పై జి స్టూడియోస్ అధినేత బోనీకపూర్, అరుణవ జాన్ సేన్  గుప్తా, ఆకాశ్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 23న ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: