ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ..!?

Anilkumar
ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన సేవా కార్యక్రమాలను కూడా చేశారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా ఆ వేడుకలకి రాం గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా రావడం జరిగింది .ఈ క్రమంలోనే జయంతి వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంజన వ్యాఖ్యలను చేయడం జరిగింది. 

తాను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో పాల్గొనడానికి రాలేదని ఒక జోక్ చెప్పడానికి వచ్చాను అంటూ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ .అయితే ఈ జోక్ వింటే ఎవరికీ నవ్వు కూడా రాదని చెప్పాడు. అయితే ఈ జోక్ విన్న తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అయితే లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చాలామంది భావిస్తారు. ఇక ముఖ్యమంత్రిగా చేసిన ఆ మహా వ్యక్తికి అవగాహన లేదా అవగాహన లేని వ్యక్తిని ఎందుకు మనం పూజిస్తూ ఆయనకు దండలు వేస్తూ ఆయన్ని పూజిస్తున్నాం అంటూ అందరినీ ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ.

సూపర్ స్టార్ రజినీకాంత్ గారు సైతం అక్కడే ఉండి  చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చుని ఆయనని పొగిడారు. అలా చంద్రబాబు నాయుడు మరియు రజనీకాంత్ ఇద్దరు ఆయన్ని పొగడారు అంటే ఒకరకంగా వారిద్దరు కూడా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినట్లు కదా.. అంటూ వ్యాఖ్యానించారు రాంగోపాల్ వర్మ .అనంతరం ఎవరి మాయలో ఎవరు పడ్డారు అన్న విషయం ఇప్పుడు కాంప్లికేట్ క్వశ్చన్ గా మారింది. మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మగాడు.. అంటూ చెప్పాడు రాంగోపాల్ వర్మ. వారందరితో కలిసి ఎన్టీఆర్ వేదిక పంచుకోకుండా అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అందుకు గల కారణం సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ఒక విపరీతమైన గౌరవం అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: