తనకి పుట్టబోయేది అమ్మాయా,అబ్బాయా రివీల్ చేసిన ఇలియానా..!?

Anilkumar
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదిలావుంటే ఇక ఈమెకి సంబంధించిన కొన్ని వార్తలు ఫోటోలు గంతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది ఇలియానా. ఒకప్పుడు సౌత్ లో టాప్ పొజిషన్లో ఉన్న ఈమె అనంతరం బాలీవుడ్ కి వెళ్ళింది. అప్పటినుండి అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా మారింది.  

బాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా, అలా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ  బిజీగా మారింది. అంతేకాదు అవకాశం దొరికిన ప్రతిసారి టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అని రివిల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ఏలా ప్రెగ్నెంట్ అయిందో ఎవరికి తెలియదు. కానీ తాజాగా ఇలియానా మాత్రం తనకు పుట్టబోయే బిడ్డ కోసం తెగ ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే  తాజా గా ఇలియానా తన ఇంస్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో ఆమె బేబీ బంప్ హైలైట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది.

ఇక ఆ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా జోడించింది ఇలియానా. ఇందులో భాగంగానే ఆమె" ఇట్స్ ఆల్ అబౌట్ ఏంజెల్స్" అంటూ రాసుకొచ్చింది.. అంటే తనకు పుట్టబోయేది అమ్మాయి అని ఇన్ డైరెక్ట్ గా ఒక హిట్ ఇచ్చింది ఇలియానా. దీంతో ఈ ఫోటోలో చూసిన వారంతా ఇలియానాకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆమె ప్రెగ్నెంట్ అని రివిల్ చేసి ఇంతకాలం అవుతున్నప్పటికీ తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరైనా విషయం మాత్రం ఇప్పటికీ బయట పెట్టలేదు ఇలియానా. ఇందులో భాగంగానే కొందరేమో కత్రినాక సోదరుడు అని అంటున్నారు. అతనితో చాలాకాలం ఇలియానా డేటింగ్ చేసిందట దీంతో ఇలియానా కి పుట్టబోయే బిడ్డకు  అతనే తండ్రి కాబోలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: