త్రివిక్రమ్ పై మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలపై మాత్రమే కాదు ఆయన జీవితంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య వుండే రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్‌ స్పీచులన్నీ కూడా త్రివిక్రమ్ రాస్తాడని అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్ బాండింగ్ వల్ల బండ్ల గణేష్‌ దూరంగా ఉండాల్సి వస్తోందని పూర్తిగా అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్‌ గురించి చెప్పాలన్నా ఇంకా పొగడాలన్నా బండ్ల గణేష్‌ తరువాతే త్రివిక్రమ్ పేరు చెప్పుకోవాల్సిందే. అందుకే పవన్ అభిమానులు ప్రతీ ఈవెంట్లో బండ్ల గణేష్‌ ఉండాలని కోరుకుంటారు.కానీ భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ విషయంలో మాత్రం పెద్ద వివాదం రేగింది. తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుకుంటున్నాడని, తనను కావాలనే పిలవడం లేదని బండ్ల గణేష్ మాటలు సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.మొదట్లో ఆ ఆడియో తనది కాదని గణేష్ బుకాయించాడు.ఆ తరువాత అవి తన మాటలే అని, త్రివిక్రమ్‌ను తిట్టానని అతను ఒప్పేసుకున్నాడు. ఇలా బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని ఇప్పుడు అందరికీ మరోసారి అర్థమైంది.


ట్విట్టర్‌లో బండ్ల గణేష్ అప్పుడప్పుడు గురూజీ అంటూ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేస్తుంటాడు.అయితే తాజాగా ఓ నెటిజన్‌కు బండ్ల గణేష్‌ ఇచ్చిన రిప్లై బాగా వైరల్ అవుతోంది. ఇక నాకు నిర్మాత కావాలని ఉంది బండ్లన్న అని ఓ నెటిజన్ సలహా అడిగాడు. అయితే గురూజీని కలువు..మంచి కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వు అంటూ కౌంటర్లు వేశాడు బండ్ల గణేష్. ఇక ఆ తరువాత మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇవ్వడం,ఇంకా దానికి ఇచ్చిన సమాధానంతో కాక రేపినట్టు అవుతోంది. గురూజీకి కనుక కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను అంతా మార్చి.. ఇక అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడట కదా? అని అడిగాడు ఓ నెటిజన్.ఇక దానికి బండ్ల గణేష్‌ ఇలా సమాధానం ఇచ్చాడు. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు  అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేశాడు. దీంతో పవన్ కళ్యాణ్‌ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నాడా? అని నెటిజన్లు డౌట్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: