వామ్మో.. వార్ సినిమా కోసం ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలీవుడ్లో రుతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమాలో నటించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ .ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. 

అంతేకాదు తెలుగులో కూడా డబ్బింగ్ రైట్స్ విషయంలో ఎన్టీఆర్ లాభాలలో వాటాలను తీసుకునేందుకు ఒప్పందం కుదిరించుకున్నాడట. అయితే ఈ స్థాయిలో ఆఫర్ను బాలీవుడ్ నుండి దక్కించుకున్న టాలీవుడ్ హీరోలు ఇప్పటివరకు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో వార్ సినిమా కోసం విలన్ పాత్రను చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో కనిపించాలని కోరుకునేవాడు.

ఎప్పటినుండో ఈ అవకాశం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నారట. అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా నటించినందుకు భారీ రెమ్యూనరేషన్ కూడా రావడంతో ఈ సినిమాను ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్  నటిస్తున్న ఈ సినిమా గనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దేవర సినిమాస్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే ఒక మూడు నెలల పాటు వార్ సినిమా కోసం తన సమయాన్ని కేటాయించబోతున్నాడట. ఇక ఆ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: