శ్రీ లీల చెంప పగలగొట్టిన బాలయ్య.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్యకి కాస్త కోపం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసింది. ఆయన ముందు ఎవరైనా తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు బాలయ్య .అయితే తాజాగా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా బాలయ్య చేతిలో తన్నులు తిన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది .ఒక పెద్ద తప్పు చేసి బాలయ్యకి దొరికిపోవడంతో బాలయ్య ఆమె చెంప చెల్లు వినిపించాడని తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే ..ప్రస్తుతం బాలకృష్ణ మరియు శ్రీనిల ఎన్బికె 108 సినిమాలో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా శ్రీ లీల ఒక కీలక పాత్రను నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో శ్రీ లీల చాలా చిల్లర వేషాలు వేసే అల్లరి పిల్లగా కనిపిస్తోందట. ఇక ఈ సినిమాలోని ఒక సన్ని విషయంలో శ్రీ లీల  ఒక పెద్ద తప్పు చేస్తోందట. దీంతో ఈ తప్పు తెలుసుకున్న బాలయ్య తీవ్ర ఆగ్రహానికి గురవుతాడట. ఇక ఆ సమయంలో బాలయ్య ఆమెని లాగి పెట్టి కొట్టాల్సి వస్తుందిట. నిజంగా సినిమాల్లో ఇటువంటి సన్నివేశాలు నిజంగా చేయరు .కొట్టరు కూడా..

ఏదో అలా పైపైన కొట్టినట్లుగా చూపిస్తారు.. అంతే అలానే బాలయ్య కూడా చేయాలని అనుకున్నారట.. కానీ శ్రీ లీల మాత్రం నిజంగానే కొట్టమని బాలయ్యకి చెప్పిందట. మనం న్యాచురల్ గా చేస్తేనే సీన్ కూడా చాలా నాచురల్ గా వస్తుందని బాలయ్య కి చెప్పింది.  దీంతో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వస్తాయి అని నిజంగానే కొట్టమని చెప్పిందిట .దాంతో బాలయ్య నిజంగానే ఆమె చెంప చెల్లుమనిపించాడట. సినిమాలోనే అయినప్పటికీ మొత్తానికి అలా రియల్ లైఫ్ లో  బాలయ్య చేతిలో దెబ్బలు తింది ఈమె. దీంతో ఈ వార్త విన్న కొందరు నిజంగానే ఈమె బాలయ్య చేతిలో తన్నులు తింది అన్న వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: