పారితోషకం విషయంలో హీరోయిన్స్ అందరూ ఒకే మాట మీద ఉండాలి : శృతి హాసన్

murali krishna
సినిమా ఇండస్ట్రీ లో అగ్రతార గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస సినిమా లలో నటిస్తూ  మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ గతం లో ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కు ఉండే వ్యత్యాసాల గురించి మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ల కు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
శృతిహాసన్ తాజా గా జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం లో భాగం గా ఓ మీడియా అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలి లో సమాధానం కూడా చెప్పారు.భారతీయ చిత్ర పరిశ్రమలో వేతన విషయం లో వ్యత్యాసాలు ఉన్నాయా అన్న ప్రశ్న ఆమెకు ఎదురయింది. ఈ ప్రశ్న కు శృతిహాసన్ తనదైన శైలి లో సమాధానం చెప్పడమే కాకుండా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఈ వ్యత్యాసం సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రతి చోట ఉందని ఆమె తెలియజేశారు. మనమందరం కూడా లింగ సమానత్వం గురించి ఎన్నో కలలు అయితే కన్నాము. బాలికల విద్య మహిళల భద్రత వంటి విషయాలన్నీ కూడా పరిష్కరించాల్సి ఉంది అయితే సినిమా రంగం లో ఈ మార్పు ఇప్పుడిప్పుడే మొదలైందని ఆమె తెలియజేశారు. ఒకానొక సమయం లో తాను కూడా తక్కువ రెమ్యూనరేషన్  తీసుకొని పనిచేశాను కానీ తాను ఎప్పుడు కూడా బాధపడలేదని తెలియజేశారు. కానీ రెమ్యూనరేషన్ల విషయం లో మాత్రం హీరోయిన్స్ అందరూ కూడా కలిసికట్టు గా ఉండాలని ఈ సందర్భం గా శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: