ఆ స్టార్ డైరెక్టర్ శిష్యుడితో సినిమా చేయబోతున్న రాజ్ తరుణ్.. ఈ సారైనా హిట్ కొడతాడా..!?

Anilkumar
టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో యంగ్ హీరో గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఈమధ్య అసలు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో రాజ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కుమారి 21ఎఫ్ ఉయ్యాల జంపాల సినిమా చూపిస్త మావ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్ .ఇక ఆ సినిమాల తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించేశారు. ఆ సినిమాల తర్వాత అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు రాజ్ తరుణ్. గతంలో ఎన్నో సినిమాలలో నటించి విజయాలను అందుకున్న ఈయన ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా అందుకోలేదు. 

ఆయన నటించిన అందగాడు సినిమా తర్వాత రాజ్ తరుణ్ ఎనిమిది సినిమాలు చేశాడు. ఇక ఆయన మీద సినిమాల్లో ఒక హిట్ కూడా లేదు. అయినప్పటికీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నప్పటికీ పట్టు వదలకుండా ఆయన దగ్గరికి వచ్చిన కథలను వింటున్నాడు అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి .ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజ్ తరుణ్ మార్కెట్ పడిపోవడంతో దర్శక నిర్మాతలు సైతం ఆయనతో సినిమా చేయాలంటే కాస్త భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ కి ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా పడితే బాగుంటుందని కోరుకుంటున్నారు రాజ్ తరుణ్ ఫాన్స్.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ మరొక శిష్యుడు రాజ్ తరుణ్ తో ఒక సినిమా తీయబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినబడుతున్నాయి. యంగ్ హీరోకు కథ కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది.ఇక కథ విన్న రాజ్ తరుణ్ సైతం సినిమా ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారట. ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్ తో బాగానే ఆకట్టుకున్న ఈయన కు ఈ వెబ్ సిరీస్ తర్వాత కూడా అవకాశాలు పెద్దగా రాలేదు .దీంతో ఈ వెబ్ సిరీస్ తర్వాత శ్రీనివాస్ గవిరెడ్డి తో ఒక సినిమా చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో సుకుమార్ శిష్యుడు రాజ్ తరుణ్ కెరియర్ని మళ్ళీ ముందుగా చేస్తాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: