వివాదంతో వెలుగులోకి వచ్చిన డింపుల్ ప్రేమ వ్యవహారం..!?

Anilkumar
ప్రస్తుతం డింపుల్ హయాతి పేరు సోషల్ మీడియాలో తెగ వినబడుతుంది. ఐపిఎస్ అధికారి రాహుల్ హెగ్డే తో ఆమెకు ఏర్పడిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పార్కింగ్ లో ఉన్న ఆయన కారును ఢీకొట్టడంతో పాటు ఆయనను కాలితో డింపుల్ హయాతి తన్నింది అంటూ ఆమెపై అభియోగం మోపారు రాహుల్. ఇక వాటికి సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదల చేయగా అందులో డింపుల్ హయాతి కోపంగా కాలితో అక్కడున్న కోన్స్ ని తన్నినట్లుగా ఉంది. ఇందుకుగాను డింపుల్ హయాతి మరియు ఆమె మిత్రుడు డేవిడ్ విక్టర్ పై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది.  

ఈ క్రమంలోనే తన అధికారాన్ని ఉపయోగించుకుని తనని తప్పుడు కేసులో ఇరికించాలని రాహుల్ హెగ్డే ప్రయత్నిస్తున్నట్లుగా డింపుల్ హయాతి ఆరోపిస్తోంది. త్వరలో  నిజ నిజాలు బయటికి వస్తాయని చాలా నమ్మకంతో ఉంది డింపుల్ హయాతి. ప్రస్తుతం కోర్టులో ఈ కేస్ నడుస్తోంది. ఓకే అపార్ట్మెంట్లో నివసిస్తున్న రాహుల్  డింపుల్ హయాతి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయని ఇందుకుగాను డింపుల్ హయాతి కారుకు పలుమార్లు ఆయన చాలా చలనాలను కూడా వేశారని పేర్కొంది డింపుల్. దీంతో ఈ వార్త విన్న డింపుల్ ఫాన్స్ ఉద్దేశపూర్వకంగానే రాహుల్ డింపుల్ కార్ కి చలనాలను వేస్తారని ఆరోపణలో వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ వివాదం కారణంగా డింపుల్ హయాతికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ఇప్పుడు బయటపడింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె బాయ్ ఫ్రెండ్ తో పాటు ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు అని తెలుస్తోంది .అంతేకాదు గతంలో ఈమె పై ఎలాంటి ఎఫైర్ వార్తలు రాలేదు. అయితే తాజాగా డేవిడ్ విక్టర్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోందట డింపుల్ హయాతి .అంతేకాదు చాలా కాలంగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్నారట. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది.అయితే కొందరైతే ఏకంగా గర్భం దాల్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల ఇలియానా సైతం తల్లి అయింది. కానీ ఇలియానా ఎవరి వల్ల గర్భవతి అయిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అంతేకాదు ప్రస్తుతం శృతిహాసన్ సైతం లివ్ ఇన్  రిలేషన్ షిప్ లోనే ఉంటుంది. తాజాగా డింపుల్ హయాతి సైతం ఒక వ్యక్తితో చాలా హ్యాపీగా ఓకే ఇంట్లో లీబ్ ఇన్ లో ఉందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: