రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!?

Anilkumar
చాలాకాలం తర్వాత డైరెక్టర్ తేజ ఒక సరికొత్త సినిమాతో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా అహింస అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక తన మాటలతో ఎప్పుడూ వార్తలు నిలిచే తేజ ఇటీవల అహింస సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఇకపోతే ఇటీవల అహింసా సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ కొందరు డైరెక్టర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇందులో భాగంగానే యాంకర్ అహింస సినిమా కూడా జయం సినిమా లాగానే ఉంటుందా అని ప్రశ్నించింది..ఇక దానికి ఊహించిన సమాధానాన్ని ఇచ్చాడు తేజ.ఆయన మాట్లాడుతూ.. రెండు సినిమాలకు తానే డైరెక్టర్ కాబట్టి ఆ రెండిటిలోనూ పోలికలు ఉంటాయన్నారు.. కొన్ని సీన్స్ ఒకేలా కూడా కనిపించవచ్చు.. అంటూ చెప్పుకొచ్చాడు.. తాను మాత్రమే కాదు ఏ దర్శకుడికైన ఇది చాలా కామన్ అని చెప్పారు.. అప్పుడే రాజమౌళి గౌతమ్ అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయంటూ సంచలన విషయాన్ని చెప్పాడు. అంతేకాదు టాలీవుడ్ డైరెక్టర్లలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఇంటిలిజెంట్ డైరెక్టర్లు ఉన్నారు..

సుకుమార్ రాజమౌళి బోయపాటి వివి వినాయక్ వీళ్లంతా కేవలం సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే వారిలో ఇంటెలిజెన్స్ లేదు..అంటూ చెప్పాడు తేజ. అంతేకాదు తాను కూడా ఇంటిలిజెంట్ డైరెక్టర్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. నిన్ను చూడకుండా చూసుకున్నారు. అంతేకాదు ఇక్కడ తెలివితేటలు ముఖ్యం కాదని..మ్యాజిక్ ముఖ్యమని.. చెప్పుకొచ్చారు. సక్సెస్లు వస్తూనే ఉంటాయి.. అంటూ తెలివిగా మాట్లాడాడు. తేజ ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసిన కూడా రాజమౌళి పై చేసిన కామెంట్స్ మాకు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేకుండా టాలీవుడ్ కీర్తిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన రాజమౌళి పై తేజ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తేజ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజమౌళి ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: