సీనియర్ నరేష్ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా ?

Seetha Sailaja
సీనియర్ నరేష్ తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తనకు తానే నిర్మించుకున్న ‘మళ్ళీ పెళ్ళి’ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ అనుకొని విజయం సాధిస్తుందా అన్న అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు పోటీగా మరే సినిమా విడుదల లేకపోవడంతో సోలో రిలీజ్ గా వస్తున్న ఈమూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈమూవీకి లాభాలు రావడం ఖాయం.

తెలుగు రాష్ట్రాలలో నరేష్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం ఆతరువాత అతడి విడాకులు ఆపై పవిత్ర తో సహజీవనం ఇలా ఈవిషయాలు అన్నీ చాల ఓపెన్ గా అందరికీ తానే చెపుతున్నాడు నరేష్. సుప్రీమ్ కోర్టు కూడ సహజీవనాన్ని చట్టబద్దం చేయడంతో ఇప్పుడు సహజీవనం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. నరేష్ వ్యక్తిగత జీవితంలోని అనేక వివాదాల చుట్టూ అల్లబడిన కథతో ‘మళ్ళీ పెళ్ళి’ మూవీని నిర్మించారు.

ఈమూవీని ప్రమోట్ చేస్తూ వరసపెట్టి వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న నరేష్ తన జీవితం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ‘చాల లైఫ్ పోయిందని కనీసం మిగిలిన జీవితాన్ని అయినా ఎంజాయ్ చేయాలి’ అని అంటున్నాడు. అమ్దుకోసమే తాను పవిత్రకు దగ్గర అయ్యాను అని అంటున్నాడు. అంతేకాదు జీవితంలో నిస్వార్థంగా ఉండాలి సద్దుకుపోవాలి అంటూ ఇలా ఎంతకాలం తాము సహజీవనం చేయవలి వస్తుందో తనకు తెలియదని తనకు పవిత్ర కు త్వరలోనే విడాకులు వచ్చి తాము పెళ్ళి చేసుకుంటామని ఆశతో ఉన్నట్లు లీకులు ఇస్తున్నాడు.

తాను తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి దాచిపెట్టడానికి ఎప్పుడు ప్రయత్నించనని ఒక ఓపెన్ బుక్ లా తన జీవితం అందరికీ అర్తంకావాలి  అన్న ఉద్దేశ్యంతో తాను ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా తీశాను అని అంటున్నాడు. ఎవరికైనా రెండు మనసులు కలిస్తే పెళ్ళి అయిపోతుందని అంటూ అలా పవిత్రత తో తన పెళ్ళి అయిపోయింది అని అంటున్నాడు. తాను జీవితంలో ఎంతపోగొట్టుకున్నానో ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా చూసినవారికి అర్థం అవుతుంది అని అంటున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: