మళ్లీ పెళ్లి కాంట్రావర్సీతో హిట్ ఖాయమా?

Chakravarthi Kalyan
సినీ హిరో నరేశ్ ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా తీశారు. ప్రస్తుతం దాని ట్రైలర్ ఎక్కువగా ట్రండ్ అవుతోంది. 26న విడుదల కాబోతోంది. నరేశ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేశ్ తో డేటింగ్ చేస్తున్నాడు. దీనిపై మూడో భార్య పవిత్ర, నరేశ్ ఉన్న హోటల్ గది వద్దకు వెళ్లి అక్కడ రచ్చ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇలా ప్రతిదీ బహిరంగ రహస్యమే. ప్రస్తుతం నరేశ్ హిరోగా పవిత్ర హిరోయిన్ గా మళ్లీ పెళ్లి అనే సినిమా తీశారు.

ఇది వీరిద్దరి స్టోరీ అయినప్పటికీ ఇది చాలా మంది స్టోరీ అని నరేశ్ చెబుతున్నారు. కొన్ని సినిమాల్లోని లేని ట్విస్టులు నరేశ్ జీవితంలో ఉన్నాయంటే నమ్మొచ్చు. ముఖ్యంగా పవిత్ర, నరేశ్ బంధంపై అనేక రూమార్స్ వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మళ్లీ పెళ్లి సినిమాతో వారు జంటగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారు.

దీనిపై సినీ  ఇండస్ట్రీతో పాటు అనేక మంది తీవ్ర విమర్శలు చేస్తున్నా వాటిని వీరు ఏమీ పట్టించుకోవడం లేదు. లేటు వయసులో డేటింగ్ అంటూ ఇద్దరిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సీరియల్ కథలా లాగ నరేశ్, పవిత్ర స్టోరీ నడుస్తోంది. తెలుగు సినీ దిగ్గజ నటుడు శరత్ బాబు చనిపోయారు.

అయితే ఆయన కూడా మళ్లీ పెళ్లి సినిమాలో ఒక పాత్ర పోషించినట్లు అది ఆయన చివరి సినిమా కావడం ఇక్కడ విశేషం. అలాగే శరత్ బాబు మొదటి భార్య సినీ నటి రమా ప్రభ కాగా, ఆమెతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. 1998 లో రెండో పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటిరిగా ఉంటున్నారు. మళ్లీ పెళ్లి ఆయన చివరి చిత్రం కావడం ఇక్కడ విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: