రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రెండుసార్లు ప్లాప్ లను అందుకున్న వినాయక్..!

Pulgam Srinivas
ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి మూవీతోను బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని గ్లోబల్ గా డైరెక్టర్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రాజమౌళి తో పాటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వి వి వినాయక్ కూడా దాదాపు ఒకేసారి కెరీర్ ను మొదలు పెట్టాడు. వీరిద్దరు కూడా దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలు పెట్టి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లుగా కెరియర్ ను కొనసాగించారు.

కానీ ఆ తర్వాత రాజమౌళి వరుస విజయాలను అందుకుంటు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటే ... వినాయక్ మాత్రం ఈ మధ్యకాలంలో వరుస అపయజాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే దాదాపు తనతో కెరీర్ ను మొదలు పెట్టిన రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వినాయక్ రెండు సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయలను అందుకున్నాడు. ఆ మూవీలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి "మగధీర" అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటించగా ... కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇన్స్పిరేషన్ తో వినాయక్... అల్లు అర్జున్ తో బద్రీనాథ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి "చత్రపతి" అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమాను తాజాగా వినాయక్ హిందీలో రీమేక్ చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకుంది. ఇలా రెండుసార్లు రాజమౌళి ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వినాయక్ ఫ్లాప్ లను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: