బ్లాక్ దుస్తులలో టు హాట్ గా కనిపిస్తున్న శృతిహాసన్..!!

Divya
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చాలా హుషారుగా సాగుతున్నది. ఇక్కడికి చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. అలా ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా అవకాశం దక్కింది. 2017లో సంఘమిత్ర సినిమా కోసం శృతిహాసన్ మొదటి సారిగా కేన్స్ లో అడుగు పెట్టింది. అప్పుడు కూడా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ ధరించి అందరిని ఆకట్టుకుంది. మళ్లీ ఆ తర్వాత 6 సంవత్సరాలకు ఆమెకు అక్కడ పాల్గొని అవకాశం లభించింది..

కేన్సలో తాను రెడ్ కార్పెట్ పై వాకింగ్ చేసిన కొన్ని ఫోటోలను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది.అక్కడ కూడా బ్లాక్ డ్రెస్సులో శృతిహాసన్ అదిరిపోయేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ దుస్తులు కావడంతో చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్సుకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి శృతిహాసన్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మామూలుగా ఈమె అందాన్ని చూసి కుర్రకారులు చూపు తిప్పుకోలేకపోతూ ఉంటారు. అలాంటిది తన శరీరానికి నలుపు రంగు మరింత అందాన్ని తెచ్చి పెట్టిందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది.
బ్లాక్ దుస్తులలో  ఏంజెల్ లా శృతిహాసన్ మెరిసిపోతోంది అంటూ పలువురు నేటిజెన్లు  సైతం కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో తరచు తన అందాలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను అలరిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ ఏడాది వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంటుందేమో చూడాలి మరి.  పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న  చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: